ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నా టాలెంట్ ఏంటో చూపిస్తా.. అంటూ ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు స్టూడియోల వెంట తిరుగుతూనే ఉంటారు.  సినిమాల్లో ఛాన్స్ రావడం అనేది అంత సామాన్య విషయం కాదు.  సక్సెస్ సాధించి  ఆర్థిక కష్టాలు వస్తే రంగుల ప్రపంచానికి దూరమైతారు.  ఇలా ఎంతో మంది నటీ, నటులు మంచి భవిష్యత్ ని నాశనం చేసుకున్నారు. కొరియో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి టివిల్లో ఛాన్స్ దక్కించుకొని వెండి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అర్థాంతరంగా తనువు చాలించాడు. తన అభిమానులను తీవ్రమైన దుఃఖసాగరంలో ముంచాడు.   

IHG

లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్, 2014, జనవరి 5న బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. కెరీర్ లో సక్సెస్ లు తగ్గడం, ఆర్థిక సమస్యలతో ఆయన 33 ఏళ్లకే తనువు చాలించాడు.  అచ్చమైన తెలుగు అమ్మాయి..  ఒక్కొక్క హిట్ వస్తున్న సమయంలో ప్రత్యూష ఊహించని పరిస్థితుల్లో 20 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది.  90వ దశకంలో అందరి చూపునూ తనవైపు తిప్పుకున్న దివ్య భారతి, బాలీవుడ్ కు వెళ్లిన తరువాత పరిస్థితి మారిపోయింది. తెలుగు లో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.

బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిన దివ్యభారతి చిన్న వయసులోనే తనువు చాలించింది. తన 17 సంవత్సరాల కెరీర్ లో సుమారు 400 చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత మరణం కూడా మిస్టరీయే. 1996లో ఆమె విషం తాగి మరణించింది. ఆమె ఆత్మహత్య ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

'ప్రేమికుల రోజు' సినిమాతో యువతలో గుర్తింపు పొందిన కునాల్ (33) 2008, ఫిబ్రవరి 7న బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బుల్లితెర, వెండి తెరపై వెలిగిపోయిన  ఎంతో మంది సినీ కళాకారులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: