బ్యాక్ ఎండ్ లో మ్యాజిక్ చేసే మేకర్స్ ఇప్పుడు కెమెరా ముందుకు వస్తున్నారు. అవుట్ ఫుట్ రాబట్టుకోవడం మాత్రమే కాదు ఇవ్వటం కూడా తెలుసు అని ప్రూవ్ చేస్తున్నారు. అవార్డులు  అందుకొని ఆర్టిస్టులుగా మారుతున్నారు దర్శకులు. ఇన్నాళ్లు ఆర్టిస్టులను భయపెట్టిన డైరెక్టర్స్ ఇప్పుడు ఆర్టిస్టులుగా జనాలను భయపెడుతున్నారు. చాలా వరకు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో విలన్ క్యారెక్టర్ లో మెప్పిస్తొన్నరు మేకర్స్. సంచలన డైరెక్టర్ గౌతమ్ మీనన్ ని స్టార్ యాక్టర్ గా మార్చేసింది 'ట్రాన్స్', స్టైలిష్ యాక్షన్ స్టోరీస్ తో రొమాంటిక్ మూవీస్ థియేటర్లో సిద్ధహస్తుడు అని గౌతమ్ మీనన్ కి మంచి డిమాండ్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ తో పాటు ట్రాన్స్ సినిమాలో నటించి సినిమా జనాలను ఆశ్చర్యపరిచాడు.

IHG

ప్రజెంట్ నటుడిగా గౌతమ్ వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. అదేరీతిలో 'ఖుషి' సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ సూర్య కూడా ఇప్పుడు  నెగిటివ్ క్యారెక్టర్ కు బెస్ట్ ఆప్షన్ గా మారిపోయాడు. మెగా ఫోన్ పక్కన పెట్టేసి కథలు రాయటం స్క్రిప్ట్ వర్క్ చేయటం ఇలాంటివి దూరం పెట్టేశాడు. విలన్ గా కెమెరా ముందు బిజీ అయిపోయాడు. స్పైడర్, మోర్శల్ సినిమాలో విలన్ పాత్ర చేసి ప్రేక్షకులను బాగా అలరించారు ఎస్.జె.సూర్య.

IHG

దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో నెగటివ్ క్యారెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.  అదేవిధంగా రియల్ అస్టిక్ స్టోరీలతో తమిళనాట మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సముద్రకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో విలన్ గా బిజీ అవుతున్నాడు. అల్లు అర్జున్  'అలా వైకుంఠపురం లో' విలన్ పాత్ర చేసిన సముద్రఖని, రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ విధంగా ఒకప్పుడు డైరెక్టర్లుగా ఉన్నవాళ్లు ప్రజెంట్ కెమెరా ముందు యాక్టర్లు గా బిజీ అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: