బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత టివి సీరియల్స్ లో నటించిన సుశాంత్ హీరోగా మారాడు.  ‘దోనీ’ సినిమాతో జాతీయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నటి మీరా చోప్రా ఆవేదనను వ్యక్తం చేసింది. అంతే కాదు బాలీవుడ్ పై మండిపడింది. సుశాంత్ బాధల్లో ఉన్నప్పుడు బాలీవుడ్ లో ఎవరూ అతన్ని పట్టించుకోలేదని విమర్శించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఘాటు లేఖను పోస్ట్ చేసింది.

 

ఈ మద్య సిని పరిశ్రమలో ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారని..  ఒకరికొకరు అండగా లేకపోవడం దారుణమని మీరా చోప్రా వ్యాఖ్యానించింది.  గత కొంత కాలగా సుశాంత్ డిప్రేషన్ లో ఉన్నాడని.. ఎంతో బాధపడుతున్నాడని అతని కోసం మనం ఏం చేశామని ప్రశ్నించింది. ఆ నటుడిపై ఎవరూ ప్రేమను చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమలో హిట్ ఉన్నవాళ్లకే కాలం ఉందని.. ఒక్క  సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ పట్టించుకోరని విమర్శించింది. ఇక్కడ జాలి, దయ అనేది ఉండదని మీరా చోప్రా మండిపడింది.  చివరి క్షణం వరకు అతను ఎంతో మానసిక క్షోభ అనుభవించాడని.. ఈ సమయంలో ఎవరు అతన్ని పరామర్శించినా.. మేమున్నామన్న ధైర్యం ఇచ్చినా బతికి ఉండేవాడని వాపోయింది.

 

చనిపోయిన తర్వాత మాత్రం సుదీర్ఘమైన సందేశాలను ఇస్తుంటారని దుయ్యబట్టింది. ఇలాంటి వాటివల్ల ప్రయోజనం లేదని చెప్పింది.  అందరం సుశాంత్ నీ విషయంలో  ఫెయిల్ అయ్యాం. అందుకే ఇండస్ట్రీ తరపున నీకు సారీ చెపుతున్నా. నీ మృతితో నా సొంత వ్యక్తిని కోల్పోయిన భావన కలుగుతోంది అంటూ మీరా ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: