అందాల నటి త్రిష. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. త్రిష వర్షం మూవీకి ఫిదా అవని వారుండరు. నువ్వు వస్తానంటే నేనొద్దంటా అంటే వద్దన్నా వస్తామని  ఫ్యాన్స్ అంటారు. త్రిష కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఆమె నటనాపరంగా స్కోర్ చేసిన పౌర్ణమి వంటి మూవీస్ ని ఇప్పటికీ టీవీలో చూస్తూంటారు. వాటికి మంచి రేటింగ్ కూడా వస్తుంటుంది.

IHG

ఇదిలా ఉండగా త్రిషతో నటించాలని అప్పట్లో ఎంతో మంది హీరోలు కలలు కనేవారు. ఓ సీనియర్ హీరో అయితే త్రిషతో నటించాలని ప్రతీ సినిమాకు అనుకుంటే ఆయన పది సార్లకు ఒకసారి త్రిష చాన్స్ ఇచ్చిందంట. దాంతో అదే అద్రుష్టమని ఆ హీరోగారు మురిసిపోయారట. అంతటి ఫాలోయింగ్ చిత్ర పరిశ్రమలోనూ త్రిషకు ఉంది.

IHG

ఇక త్రిష ఒక యంగ్ హీరోతో ప్రేమాయణం నడిపిందని ప్రచారం జరిగింది. ఇక త్రిష పెళ్ళి పీటల దాకా వచ్చి తప్పిపోయిందని అంటారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికి రెండు దశాబ్దాలుగా నటిస్తూ ఇంకా నాటౌట్ అంటున్న  త్రిష మూడు పదుల వయసులో ఉన్నా కూడా  మాకు ముద్దే అంటారు ఫ్యాన్స్. ఇక త్రిష ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందుబాట్ లో  ఉంటూ వచ్చింది.

IHG

తన కొత్త పిక్స్ పెట్టడమే కాదు. ఫ్యాన్స్ వేసే ఎన్నో కొంటె ప్రశ్నలకు ఆన్సర్  ఇస్తూ తాను ఫుల్ రోమాంటిక్ అనిపించుకుంటోంది. అటువంటి  త్రిష ఇపుడు ఫ్యాన్స్ భారీ షాక్ ఇచ్చేసింది. తాను సోషల్ మీడియా ఖాతాను మూసేస్తున్నట్లుగా ప్రకటించేసింది. ఐ లవ్ యూ అంటూ వారికి స్వీట్ గా గుండె కోత మిగిల్చింది.

IHG
సోషల్ మీడియాతో తనకు ఇబ్బందులుగా ఉందని, కొన్ని అనవసర విషయలు కూడా వినాల్సివస్తోందని త్రిష అంటోంది. ఈ విధంగా సోషల్ మీడియాను  మూసేయడం ద్వారా మెంటల్ గా ఫ్రీ అవుతాను అంటోంది.మరి త్రిష బాధలేంటి, ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంది అన్నది మాత్రం తెలియకపోయినా అందాల నటి ఇలా చేసిందేంటి అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారుట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: