బాలయ్య తోటి హీరోల వారసులు ఇప్పటికే సినిమా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరు దాదాపు పది సినిమాల వరకు ఆ వారసులు ఇప్పటికే నటించడం జరిగింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు నందమూరి అభిమానులలో బాలయ్య బాబు వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేది గత రెండు సంవత్సరాల నుండి పెద్ద హాట్ టాపిక్ అయింది. బాలయ్య బాబు ఇటీవల 60వ జన్మదిన వేడుకలు సందర్భంగా వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో చాలా మంది యాంకర్లు బాలకృష్ణని మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రశ్నలు వేయడం జరిగింది.

IHG

ఈ తరుణంలో బాలయ్య బాబు ఇప్పుడప్పుడే ఉండదని ఒక ఛానల్ కి, మరొక ఛానల్ కి మంచి స్క్రిప్ట్ రెడీ అయితే వెంటనే సినిమా ఉంటుందని రకరకాలుగా చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా బాలయ్య కొడుకు లాంచింగ్ బాధ్యతలు దిగ్గజ దర్శకుడు జక్కన్న చేతిలో బాలకృష్ణ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి డైరెక్టుగా రాజమౌళి దర్శకత్వం వహించకుండా ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నందమూరి మోక్షజ్ఞ ని లాంచ్ చేయటానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

IHG't accept if my son plays a loverboy: Balakrishna

కానీ ఈ సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం జక్కన్న దర్శకత్వ పర్యవేక్షణలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్లు టాక్. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై మోక్షఙ్ఞ మొదటి చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: