ఈ మద్య టాలీవుడ్ లో వరుసగా మల్టీస్టారర్ మూవీస్ తెరెక్కుతున్నాయి.  ఇతర భాషలకు సంబంధించి సూపర్ హిట్ సినిమాలు తెలుగులో రిమేక్ చేస్తున్నారు.  టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు రవితేజ.  చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ మాస్ హీరో. అప్పట్లో వరుసగా హిట్స్ అందుకున్నా రవితేజ ‘పవర్ ’ సినిమా తర్వాత ఫ్లాపులు అందుకున్నాడు.  దాంతో రెండేళ్లు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చాడు.

 

 అనీల్ రావిపూడి తెరకెక్కించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు.  ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో శృతిహాసన్ నటిస్తుంది. తెలుగు లో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సినిమాలకు  ఇద్దరు స్టార్ల ఇమేజ్ ను బ్యాలెన్స్  చేస్తూ.. ఇద్దర్నీ హైలైట్ చేస్తూ కథ రాయాలి. అది కత్తి మీద సాము... అందుకే, చాలామంది స్టార్ హీరోలకు మల్టీస్టారర్ సినిమాలు చేద్దామని ఉన్నప్పటికీ, కథ దొరకక వెనుకంజ వేస్తుంటారు.

 

అయితే, ఇటీవలి కాలంలో మళ్లీ ఈ తరహా సినిమాలు బాగానే వస్తున్నాయి. ఆ కోవలోనే రవితేజ, రానా కలసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నారు. ఆ మద్య మలయాళంలో మంచి హిట్ సినిమాగా పేరుతెచ్చుకున్న 'అయ్యప్పనుమ్ కోషియం' మూవీని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన బిజూ మీనన్, పృథ్వీ రాజ్ ల పాత్రలను తెలుగులో రవితేజ, రానా చేయనున్నట్టు తెలుస్తోంది.  అయితే వీరిద్దరూ ఇందుకు డేట్స్ కూడా కేటాయించినట్టు చెబుతున్నారు. దీంతో షూటింగును ఆగష్టులో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఎటొచ్చీ దర్శకుడి ఎంపికే ఇంకా పూర్తికాలేదు. హరీష్ శంకర్ పేరు మాత్రం బాగా వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: