కొందరు సినీ తారలు ఉంటారు.. ఒక్క సినిమాతోనే లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంటారు. తారాస్థాయికి వెళ్తారు అనుకుంటాం. కానీ వాళ్ళు ఆదిలోనే అంతం అవుతారు. ఆత్మహత్యలు చేసుకొని అనంతలోకాలకు వెళ్లి అభిమానులకు తీరని శోకాన్ని మిగులుస్తారు. ఇంకా ఇప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా అలాంటి తీరని శోకాన్నే మిగిల్చాడు. 

 

 

అన్ని ఉన్నాయి కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క ధోని సినిమా చుసిన మనకే అతను చనిపోయాడు అంటే బాధ వేస్తుంది. అలాంటిది బాలీవుడ్ అభిమానులకు ఇంకేంత బాధ ఉండాలి. చిన్న చిన్న ఒత్తిడిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో అంటే ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కానీ మన టాలీవుడ్ లో ఎంతోమంది ఇలాంటి బలవన్మరణానికి గురయ్యారు. 

 

 

వారి మరణాలకు సంబంధించిన నిజానిజాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు అంటే నమ్మండి. అలాంటి నటులే శృంగార తార సిల్క్ స్మిత, అందాల నటి దివ్య భారతి, టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, ఒక్క హిట్ సినిమాతో కోట్లమంది తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకున్న ప్రత్యుష, ప్రేమికుల రోజు సినిమా హీరోతో యువతని ఆకట్టుకున్న కునాల్ సింగ్ మరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. 

 

IHG

 

వీళ్ళందరూ మంచి నటులు.. కానీ మరణించారు . ఓకే మరణించారు.. కానీ వారిది ఆత్మహత్య, హత్య అనే విషయాలు ఇప్పటికి బయటకు రాలేదు అంటే నమ్మండి. అందరివీ డౌట్ లు తెప్పించే మరణాలు.. ఇప్పటికి వారివి ఆత్మహత్య, హత్య అనే మిస్టరీలు ఇప్పటికి బయటకు రాలేదు. ఇది టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఆత్మహత్యల మిస్టరీలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: