టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా అంటూ ఓటీటీ ప్లాట్ ఫాం ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడు కొత్త కథలు కొత్త దర్శకులతో ప్రయోగాలు చేసే అల్లు అరవింద్ ఓటీటీ తోను ప్రయోగం చేస్తున్నారు. ఇటీవల మొదలు పెట్టిన ఆహా ను జనాలలోకి తీసుకు వెళ్ళేందుకు ఇప్పటికే రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగా వినూత్నమైన కథాంశాలతో వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ తో పాటు బాగా ఫాం లో ఉన్న వాళ్ళని ఎంచుకుంటున్నట్టు సమాచారం.

 

ఇక ఈ నేపథ్యంలో నెమ్మదిగా సినిమాలను ఆహా లో స్ట్రీమింగ్ అయ్యోలా ప్లాన్స్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ల్యాబ్ లోనే ఉండిపోయాయి. అందులో మీడియం బడ్జెట్ సినిమాల నుంచి నాని వి, అనుష్క నిశబ్ధం..రవితేజ క్రాక్, రాం రెడ్ వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పట్లో థియోటర్స్ ఓపెన్ అయ్యో అవకాశాలు కనిపించకపోవడం ..ఒకవేళ ఓపెన్ అయినా జనాలు థియోటర్స్ కి వస్తారన్న నమ్మకాలు ఎంతమాత్రం లేవు. దాంతో ఒక్కొక్కటిగా అన్ని భాషలలో రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ కి ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇందులో అబితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ స్టార్స్ నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.

 

దీంతో తెలుగులో అల్లు అరవింద్ కూడా ఆహా ద్వారా సినిమాలని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ ని జూలై 3 నుంచి ఆహాలో చూసేందుకు రెడీ అయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో శరత్ మరార్ సమర్పించిన ఈ సినిమాకి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో అల్లు అరవింద్ ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఒక ప్రయోగం చేస్తున్నారు. ఇది గనక సక్సస్ అయితే నెమ్మదిగా మరిన్ని సినిమాలను రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: