తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమా లు వస్తూ ఉంటాయి. అందులో అందరూ ఫ్యామిలీ కూర్చుని హాయిగా నవ్వుకునే విధంగా ఉండే సినిమాలు బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయి పోతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇలా ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చిందంటే అది ఘన విజయం సాధిస్తూ వస్తుంది . అయితే ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా గా వచ్చి  ఘనవిజయాన్ని సాధించిన సినిమా ఎఫ్ 2.

 


 సీనియర్ హీరో వెంకటేష్ యువ హీరో వరుణ్ తేజ్ హీరోగా సక్సెస్ఫుల్ యువ సంచలనం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎఫ్ 2. ఈ సినిమా ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది . ఫామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చుని సినిమా చూస్తూ హాయిగా కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఫ్యామిలీ ఆడియన్స్ కి  ప్రతిక్షణం నవ్వుల మేళవింపే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. 

 


 ముఖ్యంగా ఫ్యామిలీ లోని ప్రతి ఒక్కరికి ఈ సినిమా స్టోరీ బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటుంది. ఇలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పటికికూడా ఈ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్సినిమా చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అంతేకాదు ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా... మొదటిసారి చూసిన ఎంటర్టైన్మెంట్ ని  ఆడియన్స్ కు  పంచుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఈ సినిమా ది బెస్ట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: