బాహుబలి తర్వాత తాను తీస్తే ఓ మీడియం బడ్జెట్ సినిమా చేస్తా.. ఆ సినిమాలో ఏమాత్రం గ్రాఫిక్స్, సిజి వర్క్ లేకుండా చూస్తానని ప్రకటించిన జక్కన్న మరో సంచలనానికి నాంధి పలికాడు. ఒక హీరోతోనే రికార్డులు తిరగరాసే రాజమౌళి సినిమాలు ఇద్దరు స్టార్స్ అది కూడా మంచి ఫాం లో ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. అలా సినిమా ఎనౌన్స్ చేశాడో లేదో ఇక రికార్డులన్ని ఈ సినిమావే అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు.

 

రౌద్రం రణం రుధిరం అంటూ ప్రీ లుక్ పోస్టర్ తో నీరు, నిప్పు కలయికతో పోస్టర్ తోనే అంచనాలు పెంచాడు రాజమౌళి. బాహుబలి తర్వాత నిజంగానే ఓ మాములు సినిమా చేయాలని అనుకున్నాడట రాజమౌళి కాకపోతే తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన లైన్ నచ్చి డెవలప్ చేయగా అది ఓ అద్భుతమైన కథ అయ్యిందట. అదే ఆర్.ఆర్.ఆర్ సినిమా. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరు స్వేచ్చ, స్వాతంత్రం కోసం పోరాడిన వారే. ఒకే కాలానికి చెందిన ఇద్దరు వేరు వేరు వ్యక్తులు.. రియల్ ఫ్రీడం ఫైటార్స్ సినిమా కథలో కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ కథ మొదలైంది.

 

అనుకున్నట్టుగా కథ అద్భుతంగా రావడం.. ఆ కథను చరణ్, తారక్ లతో షేర్ చేసుకోగా వాళ్లు ఓకే చెప్పడం ఇలా ఆర్.ఆర్.ఆర్ సినిమాకు అంతా కలిసి వచ్చింది. బాహుబలి కాదు దానికి పది రెట్లు ఎక్కువ అంచనాలతో ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. తప్పకుండా ఈ సినిమా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని చెప్పొచ్చు. సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఇద్దరి హీరోల ఫ్యన్స్ ను ఎక్సయిటింగ్ కు గురి చేస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: