యువ హీరో నిఖిల్, టాలెంటెడ్ డైరక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వల్ గా వస్తున్న సినిమా కార్తికేయ 2. ఈ పార్ట్ 2 కథకు మొదటి సినిమాకు సంబంధం ఉంటుందా లేదా అన్నది తెలియలేదు కాని కార్తికేయ 2ని అంచనాలను మించి తెరకెక్కిస్తున్నారట. నిఖిల్, చందు ఎవరికి వారు కెరియ్ర్ బెస్ట్ ఇచ్చేస్తున్నారట. మరోసారి కార్తికేయ సినిమా మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. అయితే కార్తికేయ సినిమా కేవలం టాలీవుడ్ వరకు మాత్రమే రిలీజై సక్సెస్ అయ్యింది. కాని ఇప్పుడు ఈ సినిమా సీక్వల్ కార్తికేయ 2ని ఐదు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ వేశారు.

 

చందు మొండేటి ఈ కథను యూనివర్సల్ కాన్సెప్ట్ గా రాసుకున్నాడట. అందుకే ముందు తెలుగు వరకే రిలీజ్ అనుకున్న ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కార్తికేయ 2 నుండి లేటెస్ట్ గా వచ్చిన ప్రోమోతో అంచనాలు పెంచారు. కెరియర్ లో ఆచితూచి అడుగులేస్తున్న నిఖిల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. 

 

కార్తికేయతో తన ప్రతిభ చాటిన చందు మొండేటి ఆ తర్వాత ప్రేమం తో రీమేక్ హిట్ అందుకోగా ఆ తర్వాత్ సవ్యసాచి సినిమాతో మాత్రం అంచనాలు అందుకోలేదు. అయితే ఈ సినిమా తర్వాత చందు మళ్లీ నిఖిల్ తో కలిసి కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  నిఖిల్, చందు ఇద్దరు ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు. బాలీవుడ్ ఆడియెన్స్ షాక్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: