హీరోయిన్లకు ప్రేమాయణం కొత్తేమీ కాదు. కొన్నాళ్లు కలిసి షికారు చేయడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం కామన్. అయితే ఒక్కసారి విడిపోయాక కూడా వారితో కలిసి నటించేందుకు వెనుకాడరు. క్యూట్ బ్యూటీ రష్మిక కూడా ఇప్పుడు తన మాజీ ప్రియుడిని కలిసేందుకు సై అంటోంది. 

 

సినిమాలు, ఆఫర్లు కంటే గాసిప్స్ తోనే ఎక్కువగా లైమ్ లైట్ లో ఉంటుంటారు హీరోయిన్లు. నయనతార అయితే ఇప్పటికే శింబు, ప్రభుదేవాతో ప్రేమలో మునగడం.. తెగదెంపులు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉన్న నయన్.. ఫస్ట్ ప్రేమికుడు శింబుతో తిరిగి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే బాలీవుడ్ బ్యూటీలు.. దీపికా పదుకొనే, కత్రినా కైఫ్.. తమ తమ మాజీ ప్రియులతో కలిసి నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రష్మిక కూడా అదే చేస్తానంటోంది. 

 

అతి తక్కువ టైమ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక.. ఏ ముహూర్తాన టాలీవుడ్ లో అడుగుపెట్టిందో గానీ.. ప్రస్తుతం ఏ పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయినా.. హీరోయిన్ గా ముందుగా రష్మిక పేరే తెరపైకి వస్తుంది. అయితే వరుస ఆఫర్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ బ్యూటీ.. ఫస్ట్ సినిమాతోనే ప్రేమలో పడిపోవడమూ.. విడిపోవడమూ జరిగింది. అయినా తన మాజీ ప్రియుడితో మళ్లీ కలిసి నటిస్తాను అంటోంది. 

 

రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ. కన్నడంలో రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి.. ప్రస్తుతం సీక్వెల్ రూపొందేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సిినిమా సమయంలో రష్మిక, రక్షిత్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏమైందో గానీ బ్రేకప్ అయ్యారు. దాంతో కిరిక్ పార్టీ సీక్వెల్ లో రష్మిక హీరోయిన్ కాదని తేల్చేశాడు రక్షిత్. కానీ రష్మిక, రక్షిత్ తో నటించేందుకు తనకేమీ ప్రాబ్లమ్ లేదనీ తేల్చి చెప్పింది. మరి అందుకు రక్షిత్ ఒప్పుకుంటాడా.. ఇద్దరూ కలిసి నటిస్తే మళ్లీ వాళ్ల మధ్య పాత జ్ఞాపకాలు చిగురిస్తాయా.. అనేది ఇప్పుడు చెప్పలేం. 

మరింత సమాచారం తెలుసుకోండి: