శ్రీదేవి నటించిన పదహారేళ్ల వయసు..ఇప్పుడు రిలీజ్ అయితే ఎలా ఉంటుంది. అందులోనూ కమల్ హాసన్.. రజినీకాంత్, శ్రీదేవి కాంబినేషన్ అంటే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి కొత్త హంగులతో రాబోతున్న ఆ సినిమా గురించి ఎన్నో విశేషాలున్నాయి. 

 

పదహారేళ్ల వయసు చిత్రం శ్రీదేవి కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా వచ్చి దాదాపు 42ఏళ్లు అవుతోంది. చంద్రమోహన్, మోహన్ బాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మాతృక, పదునారు వయతినిలే అనే తమిళ చిత్రం. భారతీయ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ్ లో కూడా శ్రీదేవినే హీరోయిన్ గా నటించగా.. కమల్ హాసన్, రజినీకాంత్ కీరోల్ పోషించారు. 

 

అప్పట్లో పదినారు వయతినిలే.. సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకొని, పలు అవార్డులు సొంతం చేసుకుంది. తమిళ్ వెర్షన్ కు ఇళయరాజా సంగీతం అందించారు. ఇప్పుడు ఈ సినిమాను తిరిగి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధునాతన డాల్బీ సౌండ్ తో, తెలుగు భాషకు అనువదించి, డిజిటలైజ్ చేసి, అన్ని పాటలను మళ్లీ కొత్తగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తెలుగులో నీకోసం నిరీక్షణ టైటిల్ పెట్టారు. 

 

కొత్త హంగులతో వస్తున్న పదునారు వయతినిలే చిత్రాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచానికి విడుదల చేసిన అనంతరం.. మరో 5భాషల్లో డబ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సుప్రీమ్ ఆల్ మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

 

మధురమైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని.. నిర్మాత బామారాజ్ కణ్ణు తెలిపారు. ఇటీవల 5 పాటలను రిలీజ్ చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఓ 30 నిమిషాలు దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా మార్పులు చేశారట. ఏది ఏమైనా.. శ్రీదేవి నీకోసం నిరీక్షణతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: