సాధారణంగా వెంకటేష్ సినిమాలు వస్తున్నాయి అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాలను  ఏ మాత్రం మిస్ అయ్యే అవకాశం అనేది ఉండదు అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆయన సినిమాలు చాలా బాగా దగ్గరయ్యాయి అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ముందు రోజు సినిమా చూసే పరిస్థితి మన తెలుగులో ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. ఆ విధంగా వెంకటేష్ పేరు తెచ్చుకున్నాడు అనే చెప్పాలి. ఇక అతని కెరీర్ లో వచ్చిన కొన్ని కొన్ని సినిమాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా లక్ష్మీ. వెంకటేష్ హీరో గా వచ్చిన ఈ సినిమాలో  కథ ఒక రేంజ్ లో ఉంటుంది. తమ్ముళ్ళు అంటే ఒక అన్న ఏ విధంగా ఉండాలి అనేది ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. అదే సినిమా కథకు ఒక రేంజ్ లో హైలెట్ అయింది. ఇక సినిమాలో ఫ్యామిలీ సన్నివేశాలు బాగా నచ్చుతాయి కూడా. ఫ్యామిలీ కి బాగా దగ్గరయ్యే విధంగా ఉంటాయి. ఈ సినిమాతో ఫ్యామిలీ కి మరింత దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగా నచ్చాయి జనాలకు అని చెప్పవచ్చు. 

 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార నటన సినిమాకు హైలెట్ అయింది అని చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఛార్మి కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకటేష్ నారప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే సూచనలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత ఇంకా రాలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఖాళీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: