పవన్ రాజకీయాలకు సంబంధించిన ముహూర్తమే కాదు పవన్ ఫిలిం రీ ఎంట్రీ కోసం నిశ్చయించుకున్న ముహూర్తంలో కూడ ఎదో లోపం ఉందని పవన్ వీరాభిమానులు బాధపడిపోతున్నారు. వాస్తవానికి కరోనా సమస్యలు రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి ‘వకీల్ సాబ్’ విడుదల అయి ఉండేది.


అయితే ఏదీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతూ ఉండటంతో పేరుకు పవన్ కళ్యాణ్ రెండు సినిమాలలో నటిస్తూ ఉన్నా ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అన్న నైరాశ్యంలో పవర్ స్టార్ అభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో పవన్ రీ ఎంట్రీ చాల అదిరిపోయేలా ఉండాలి అంటే తమిళంలో సూపర్ హిట్ అయిన ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ రవితేజా లు కలిసి నటిస్తే బాగుంటుంది అంటూ అభిమానులు కలలు కనడమే కాకుండా దీనికి సంబంధించిన ఒక పోష్టర్ ను డిజైన్ చేసుకుని పవన్ అభిమానులు చేస్తున్న హడావిడి చూస్తూ ఉంటే పవన్ నుండి ఎలాంటి పవర్ ఫుల్ సినిమాలు అతడి అభిమానులు ఊహించుకుంటున్నారో  అర్ధం అర్ధం అవుతుంది.


వాస్తవానికి విక్రమ్ వేద తెలుగు రీమేక్ విషయాలు ఒక సంవత్సరం క్రితం ఇండస్ట్రీలో హడావిడి చేసి ఆ తరువాత సద్దుమణిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈమూవీ తెలుగులో పవన్ రవి తేజాల కాంబినేషన్ లో రీమేక్ కాబడుతోంది అంటూ వార్తల వదావిడి మొదలైంది. తమిళంలో మాధవన్ విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేద సినిమా హక్కులు ఇంకా ఆ మూవీ నిర్మాతలు ఇంకా ఎవరికీ అధికారికంగా ఇవ్వలేదని తెలుస్తోంది.  


అయితే పవన్ కళ్యాణ్ రవితేజల కాంబినేషన్ లో డైరెక్టర్ డాలీ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కోసం ఈ మూవీ ప్రాజెక్ట్ ను చేయడానికి అప్పుడే స్క్రిప్ట్ పనులు మొదలైపోయాయి అంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ ను పవన్ కు రవితేజా కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్ళూరి నిర్మించబోతున్నాడనే వస్తున్న వార్తలు విని ఇంకా ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడకుండానే పవన్ అభిమానులు చేసున్న హడావిడి చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: