నరసింహ... ఏ భాషలో అయినా సరే ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. రజని కాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా ఏ విధంగా చెప్పినా సరే తక్కువే. టాలీవుడ్ ని ఈ సినిమా షేక్ చేయగా తమిళ సినిమాలు అయితే ఈ సినిమాను చూసి భయపడ్డాయి. కథ ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా నుంచి లేడీ విలన్ అనే కాన్సెప్ట్ ఇండియన్ సినిమాకు అర్ధమైంది. కథ నుంచి సినిమాలో నటుల నటన వరకు కూడా సినిమాకు ఎక్కడలేని అందాన్ని తీసుకొచ్చాయి అని చెప్పాలి. ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. 

 

సినిమా తర్వాత రజని కాంత్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది అని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చాలా బాగా ఆదరించారు అనేది వాస్తవం. ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా సినిమా స్థాయి ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్ళాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా హీరోయిన్ గా నటించిన సౌందర్య. విలన్ గా నటించిన రమ్యకృష్ణ సినిమాలో జీవించారు అనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అవడానికి ప్రధాన కారణం రమ్యకృష్ణ నటన అని చెప్తారు జనాలు. 

 

ఆ రేంజ్ లో ఆమె జనాలకు ఒక రేంజ్ లో పిచ్చి ఎక్కిచారు ఈ సినిమాలో అనేది చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆమెను స్టార్ దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో కీలక పాత్రలకు తీసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. చాలా సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: