టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలకు ఎప్పుడు వచ్చినా సరే కచ్చితంగా ఆదరణ అనేది ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే కొన్ని కొన్ని సినిమాల విషయంలో తీసుకునే జాగ్రత్తలు సినిమా రేంజ్ ని ఒక రేంజ్ లో పెంచుతూ ఉంటాయి అనేది వాస్తవం. ఆ విధంగా వచ్చిన సినిమాలు ఎప్పుడు టీవీ లో వచ్చినా సరే జనాలు కచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగులో బన్నీ సినిమాలు అదే విధంగా ఉంటాయి. 

 

సినిమా సినిమాకు అతను తీసుకునే జాగ్రత్తలు గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ప్రతీ సినిమాకు కూడా అతను ఎన్నో విధాలుగా జాగ్రత్తలు తీసుకుని సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక టాలీవుడ్ లో అతని సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో పిచ్చి ఉంది అని చెప్పవచ్చు. ఇక అతని కెరీర్ లో అతను చాలా జాగ్రత్తలు తీసుకుని వరుస ఫ్లాప్ ల తర్వాత చేసిన సినిమా జులాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది అని చెప్పాలి. 

 

ఈ సినిమాలో బన్నీ నటన నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రతీ ఒక్కటి నచ్చింది. ఒక కొడుకుని ఏ విధంగా జాగ్రత్తలతో పెంచాలి ఏ విధంగా ఉంచాలి ఏ విధంగా ముందుకి నడిపించాలి అనేది ఈ సినిమాలో స్పష్టంగా ఉంటుంది. ఈ సినిమా కథ సినిమాకు ఒక స్పెషల్ హైలెట్ అనే చెప్పాలి. ఉండే ప్రతీ ట్విస్ట్ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతూ ఉంటుంది అని చెప్పాలి. అందుకే ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: