అప్పటివరకు విక్టరీ వెంకటేష్ సినిమాలంటే కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్ ఇలా అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉండేవి. అయితే తన పంథాకు కొద్దిగా కొత్తగా ప్రయంతించిన సినిమా జయం మనదేరా. ఎన్.శంకర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ డ్యుయల్ రోల్ చేశారు. మహదేవ నాయుడు, అభిరాం రెండు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు వెంకటేష్. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మహదేవ నాయుడు పాత్రలో వెంకటేష్ నటన ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది.

 

పగ వాడికి ఇంటికి వెళ్తే ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా.. తోడబుట్టిన చెల్లి తొలిచూరు కాన్ పు చేసుకుందని.. అల్లుడిని చూసేందుకు వెళ్తాడు మహదేవ నాయుడు. అదే అదునుగా చేసుకున్న మహదేవ నాయుడు శత్రువులు తినే అన్నంలో విషం కలిపి పెడతారు. ఆ సన్నివేశం అప్పటికి ఇప్పటికి హ్రుదయాలను హత్తుకుంటుంది. ఈ సినిమాకు మరో విశేషం ఏంటంటే ఎప్పుడు అభ్యుదయ, విప్లవాత్మక సినిమాలకు మ్యూజిక్ అందించే వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఆ సినిమాలో వెంకటేష్ సరసన సౌందర్య హీరోయిన్ గా నటించారు. యూరప్ ట్రిప్ లో హీరోయిన్ ను ట్రాక్ లో పెట్టాలని చూస్తాడు వెంకటేష్. ఇక ఆ ఎపిసోడ్ లో ఎల్బి శ్రీరాం కామెడీ ఆడియెన్స్ కడుపు చెక్కలయ్యేలా చేసింది. బ్రహ్మానందం చిలిపి దొంగ పాత్ర కూడా మెప్పిస్తుంది. 

 

సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సాంగ్స్ లో తన ప్రతిభ చాటారు వందేమాతరం శ్రీనివాస్ రావు. ఎన్.శంకర్ డైరక్షన్ లో వచ్చిన జయం మనదేరా సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. వెంకటేష్ అభిమానులకు అయితే ఈ సినిమా పండుగ చేసుకునేలా చేసింది. మళ్లీ జయం మనదేరా లాంటి సినిమా వెంకీ నుండి ఆశిస్తున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: