2008 జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోరింటాకు చిత్రంలో హీరో రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో అత్యంత సహజంగా నటించి సినీ ప్రేక్షకులను బాగా ఏడిపించేసారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ సినిమా కన్నడ భాషల్లో విడుదలైన అన్న తంగి చిత్రానికి రీమేక్ కాగా... ఒరిజినల్ సినిమాలో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రానికి వి ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా... ఎస్.ఏ రాజకుమార్ సంగీతం అందించాడు. 


గోరింటాకు సినిమా కథ గురించి తెలుసుకుంటే... భూస్వామి సర్వారాయుడు(రాజశేఖర్) కి కుమారుడు, కుమార్తె అయిన అశోక్(రాజశేఖర్), లక్ష్మి(మీరా జాస్మిన్) ఎంతో ప్రేమ ఆప్యాయతలతో తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. తల్లి చనిపోవడంతో అశోక్ తన చెల్లికి ఏ లోటు రాకుండా ఎంతో గారాబంగా చూసుకుంటాడు. ఈ క్రమంలోనే లక్ష్మి ఆకాష్( జై ప్రకాష్) అనే ఒక యువకుడిని ప్రేమిస్తుంది. కానీ తన అన్నయ్య ఒప్పుకుంటేనే అతడిని పెళ్లి చేసుకుంటానని ఒక షరతు పెడుతుంది. అయితే తన అన్నయ్య తన చెల్లి ప్రేమను ఒప్పుకోగా... వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. మరోవైపు అన్నయ్య అశోక్ కూడా తన గ్రామానికి చెందిన పేద పిల్ల నందినిని(ఆర్తి అగర్వాల్) తన చెల్లి పెళ్లి రోజే వివాహం చేసుకుంటాడు. 


లక్ష్మీ తన భర్త, అతడి కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా తన వివాహ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలా ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత లక్ష్మి, ఆకాష్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు పుడతాడు. కానీ అశోక్ భార్య నందిని కి మాత్రం సంతానం కలగదు, ఆమె గర్భం దాల్చినప్పటికీ గర్భస్రావం అవుతుంది. తనకి ఆంటీ గా చెప్పుకునే సూర్యకాంతం తన భర్త చనిపోవడానికి సర్వారాయ డే కారణమని భావించి వారి జీవితాల్లో ఎంట్రీ ఇచ్చే నందిని గర్భాశయం కూడా తీయించేస్తుంది. దాంతో అశోక్ కి తండ్రి అయ్యే అవకాశం పోతుంది. ఇది తెలుసుకున్న తన చెల్లి తన భర్త, పిల్లలను అశోక్ ఇంటికి తీసుకువచ్చి అతడిని సంతోషపరుస్తుంది. ఎప్పుడైతే తన మెట్టినింటి బంధువులంతా పుట్టిన ఇంటికి చేరుతారో ఆ క్షణం నుంచి ఆస్తి మొత్తం తమ సొంతం చేసుకోవడం ప్రారంభిస్తారు. 


ఈ క్రమంలోనే అశోక్ చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ కాగా... సూర్యకాంతం నందిని సహాయంతో లక్ష్మీ ని బయటకు గెంటి వేస్తోంది. లక్ష్మిని తన సోదరుడైన ఆకాష్ తో కలవకుండా చేస్తుంది నందిని. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న అన్నయ్య అశోక్ పుట్టెడు దుఃఖంతో తన ప్రాణాలను కూడా తీసుకుంటాడు. ఈ అన్నాచెల్లెళ్ల కథ మొత్తం ప్రేక్షకులను బాగా ఏడిపించేసింది. అప్పట్లో సెంటిమెంటు సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించేవారు. ఈ సినిమాలో కావాల్సినంత సెంటిమెంట్ ఉండడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వేల సంఖ్యలో తరలివచ్చి థియేటర్లలోనే ఎక్కెక్కి ఏడ్చారు అంటే అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: