టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల్లో ఇప్పుడు నటించే హీరోయిన్ లు చాలా డిమాండ్ లు చేస్తున్నారు. అవకాశం వస్తే చాలు అనుకున్న స్థాయి నుంచి ఇప్పుడు వరుసగా అవకాశాలు వచ్చే స్థాయికి వెళ్ళారు. దీనితో స్టార్ హీరోయిన్ లు గా ఉన్న కొందరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అనే వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో పూజ హెగ్డే కి మంచి క్రేజ్ ఉంది. ఆమె మొదటి సినిమా నుంచి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.  చిన్న చిన్న సినిమాలు చేసినా సరే ఆ తర్వాత ఆమెకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. 

 

ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు అవకాశం ఇవ్వడానికి చాలా మంది హీరోలు ముందుకు వస్తున్నారు కూడా. ఈ తరుణంలో ఆమె కాస్త డేట్స్ ఇచ్చే విషయంలో హీరోలను బాగా ఇబ్బంది పెడుతున్నారు అని జనాలు అంటున్నారు. ఆమె ఇప్పుడు అవకాశాలు వస్తున్నా సరే కన్నడ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది అని అక్కడి అవకాశాలను చూసుకుని ఇక్కడి హీరోలను అసలు ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని అంటున్నారు జనాలు. 

 

టాలీవుడ్ లో ఆమెతో సినిమాలు చెయ్యాలి అనుకుంటున్నా హీరోలు అందుకే ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు అని సమాచారం.  కొంత మంది అయితే ఆమెను అసలు వద్దు అని చెప్పారు అని అక్కడ ఫోకస్  పెట్టి ఇక్కడ తమకు డేట్స్ తక్కువగా ఇస్తుంది అనే అసహనం వారిలో ఎక్కువగా ఉంది అని దీనితోనే ఇప్పుడు వారు అందరో కూడా ఆమెను పక్కన పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఆమె విషయంలో నిర్మాతల మండలి లో కూడా చర్చ జరిగింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: