ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేశంలో ఏ  భాష లో అయినా సరే సినిమా విడుదల కావాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్ర హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు విడుదల కావడానికి అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నా సరే ఆ సినిమాలు మాత్రం విడుదల అయ్యే అవకాశం దాదాపుగా కనపడటం లేదు అనే అంటున్నారు. ఇక ఇప్పుడు ఒక విషయం ఏంటీ అంటే సినిమాల విషయంలో ఇక  ఓటీటీ ని మాత్రమే నమ్ముకోవాలి అని భావిస్తున్నారు. అవును ఓటీటీ అయితేనే ఇప్పుడు చాలా వరకు తమ కష్టాల నుంచి బయటకు తీసుకొస్తుంది అని అంటున్నారు. 

 

దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఓటీటీ ఫ్లాట్ ఫాం లో సినిమాలను ఎక్కువగా విడుదల చేయవచ్చు. దానికి తోడు ఎక్కువ మంది సినిమా చూసే అవకాశ అనేది ఉంటుంది. అందుకే తక్కువ ధరకే సినిమాలను  పూర్తి చేసి ఓటీటీ లో సినిమాలను విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారు జనాలు. ఇటీవల కీర్తి సురేష్ సినిమా ఓటీటీ లో విడుదల యింది. విడుదల అయిన రోజుల వ్యవధిలో దానిని మూడు కోట్ల మంది వీక్షించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు కనీస ధర పెట్టాలి అని అమెజాన్ ప్రైమ్ కూడా భావిస్తుంది. అందుకే ఇప్పుడు ఆ సినిమా తరహాలోనే తమ సినిమాలను కూడా విడుదల చెయ్యాలి అని చూస్తున్నారు. 

 

తక్కువ బడ్జెట్ అయి ఓటీటీ లో సినిమాకు కనీస ధర పెడితే మాత్ర౦ మంచి లాభాలు వస్తాయి అని అంటున్నారు. మరి దీనిని ఏ విధంగా తీసుకోని వస్తారు అనేది చూడాలి. ఇప్పుడు అగ్ర హీరోలు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. మరి ఎం చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: