ఇప్పుడు మన తెలుగులో తమిళ సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పుడు ఇక్కడి సినిమాలను మాత్రమే విడుదల చేసే పరిస్థితి లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ హీరోలు మన తెలుగులో సినిమాలను విడుదల చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఒక నిర్ణయం తీసుకున్నారు తమిళ హీరోలు. తెలుగు లో విడుదల చేసే సినిమాలను ఎక్కువగా ఓటీటీ లోనే విడుదల చెయ్యాలి అని తమిళం మాత్రమే థియేటర్ లో విడుదల చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. 

 

తమిళ సినిమాలను ఇప్పుడు ఇక్కడ కొనే వారు కూడా దాదాపుగా ఎవరు లేరు అనే సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఎం చెయ్యాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఆ నిర్ణయం తీసుకున్నారు జనాలు. ఇప్పుడు టాలీవుడ్ లో మన సినిమాలకు కూడా విడుదల అయ్యే యోగం కనపడక దాదాపుగా అన్ని సినిమాలను కూడా వాయిదా అవేసుకున్నారు. ఈ తరుణంలో ఇతర భాషలకు అసలు అవకాశమే లేదు. సూర్య తో పాటుగా విజయ్ కూడా తన సినిమాలను తెలుగులో మాత్రం ఓటీటీ లో విడుదల చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు అని తెలుస్తుంది. 

 

ఇక మరి అజిత్ కూడా దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. వీరు అందరికి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఏ విధంగా ఇది ఫలిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు మన తెలుగులో దాదాపు పది సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. అటు కేంద్రం కూడా సినిమాలను అసలు దాదాపుగా వద్దు అనే చెప్పి పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: