టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కోసం జనాలు ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఇక ఈ సినిమా మొదలైన నటి నుంచి నేటి వరకు కూడా అనేక వాయిదాలు పడుతూ వస్తుంది. ఏదోక కారణంతో సినిమాను చిత్ర యూనిట్ వాయిదా వేస్తూనే ఉంది. దీనితో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో కూడా ఆందోళన అనేది పెరుగుతుంది. ఇప్పటికే మెగా హీరో నందమూరి హీరో నుంచి సినిమా వచ్చి ఏడాదికి పైగా అయిపోయింది. 

 

ఇద్దరి సినిమాలు కూడా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటాయి. ఇక ఇపుడు మళ్ళీ వాయిదా పడటంతో అసహనం అనేది తారా స్థాయిలో పెరుగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మన తెలుగులో సినిమాల మీద లాక్ డౌన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. సినిమాల విడుదల మీద ఇప్పుడు ఎక్కువగా లాక్ డౌన్ ప్రభావం పడిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి అసలు వసూళ్లు వస్తాయా లేదా అనే ఆందోళన సినిమాలు కొన్న వారిలో చాలా ఎక్కువగా ఉంది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

సినిమాను చాలా మంది ముందుగా కొని పెట్టారు. అందుకోసం భారీగా ఇచ్చేసారు కూడా. దీనితో ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మందికి ఈసినిమా వసూళ్ళ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ముందుగా కొన్నారు కాబట్టి అసలు వసూళ్లు రాకపోతే పరిస్థితి ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. అందుకే సినిమా కొన్న చాలా మంది అడ్వాన్స్ ని వెనక్కు ఇవ్వాలి అంటూ కోరుతున్నారు. మరి ఎం చెయ్యాలో అనే దాని మీద రాజమౌళి కసరత్తు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: