ఇప్పుడు టాలీవుడ్ లో చిన్న హీరోయిన్ ల పరిస్థితి చాలా వరకు దారుణంగా ఉంది. వాళ్లకు అవకాశాలు మాత్రం వచ్చే సూచనలు ఈ మధ్య కాలంలో దాదాపుగా లేవు అనే చెప్పాలి. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇప్పుడు స్టార్ హీరోయిన్ తో సినిమానే మంచిది అనే ఆలోచనలో దాదాపుగా ఉన్న సంగతి తెలిసిందే. చిన్న హీరోలు కూడా భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుని చిన్న హీరోయిన్ లకు అవకాశాలు ఇవ్వడం లేదు. దీనితో ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ ల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది అనే వ్యాఖ్యలు అయితే వినపడుతున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే మన తెలుగులో కొందరు హీరోయిన్ ల విషయంలో నిర్మాతలు మరీ దారుణంగా ఉన్నారు అని అంటున్నారు. అగ్ర హీరోలతో ఒక్క అవకాశం వచ్చినా సరే చాలు అనుకునే విధంగా పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు చాలా మంది హీరోయిన్ లు తెలుగుకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. కొంత మంది హీరోయిన్ లు ఇప్పుడు తీవ్ర అసహనంగా ఉన్నారు అని వాళ్ళు ఇప్పుడు తెలుగు నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారు అని అంటున్నారు  జనాలు. మరి నిజం ఎంత అనేది తెలియదు గాని టాలీవుడ్ లో మాత్రం చిన్న హీరోయిన్ లకు అసలు భవిష్యత్తు లేదట. 

 

అందుకే ఇప్పుడు వాళ్ళు తెలుగు నుంచి తప్పుకోవాలి అని చూస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇక అగ్ర హీరోలు కూడా చిన్న హీరోయిన్ లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అనే సంగతి తెలిసిందే. అయితే వారికి తమిళం లో మాత్రం మంచి గుర్తింపు ఉంది. అక్కడ వారికి మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి అని ప్రచారం మాత్రం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: