ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించే దర్శకులలో.. ప్రత్యేక గుర్తింపు సంపాదించి తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను మెప్పించి ఎన్నో విజయాలను అందుకున్న దర్శకుడు సుకుమార్. సుకుమార్ సినిమా అంటే కాలిక్యులేషన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా గుర్తుకొస్తాయి తెలుగు ప్రేక్షకులకు. ప్రతి సినిమాలో తనదైన కాలిక్యులేషన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు దర్శకుడు సుకుమార్. 

 


 అయితే దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సినిమాలు ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్ తో ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే సుకుమార్ మొదటి సారి ఒక రా  కంటెంట్ తో... రామ్చరణ్ లాంటి స్టార్ హీరోతో రంగస్థలం అనే సినిమాను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను మెప్పించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. రంగస్థలం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త ట్రెండ్ సృష్టించింది అని చెప్పాలి. రామ్ చరణ్ సమంత జోడి గా నటించిన ఈ సినిమా... ప్రతి అంశంలోనూ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక సంచలన విజయాన్ని కూడా అందుకుంది.

 

 ఈ సినిమాలో  చెవిటివాడుగా  ఉన్న రామ్ చరణ్... తన అన్న కోసం.. తన కుటుంబం కోసం ఎంతలా పరితపించి పోతుంటాడు. తన  ప్రాణాలకూ ప్రమాదం అని తెలిసినప్పటికీ తన అన్న కోసం చేసే రిస్కులు తెలుగు ప్రేక్షకుల ను కట్టి పడేశాయి అని చెప్పాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ తనలోని నటుడి ని నిరూపించుకొని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు . ఇక ఈ సినిమాలో సుకుమార్ తన కాలిక్యులేషన్స్ తో  ప్రతి సన్నివేశంలో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ సినిమాలో ని ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కంటనీరు పెట్టిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: