‘నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా..’ ఇది పవన్ కల్యాణ్ సూపర్ హిట్ డైలాగ్. ఈ డైలాగ్ కు కరెక్ట్ గా సరిపోతాడు దర్శకుడు తేజ. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా వర్మతో రాత్రి, అంతం.. వంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశాడు. కెమెరా నుంచి సినిమాలు చూసిన తేజ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి అద్భుతాలు చేశాడు. ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాసుకుని ఏకంగా ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీశాడు. వి’చిత్రం’ ఏంటంటే సినిమాలో హీరో, హీరోయిన్లు కూడా కొత్తవారే.  ఆ సినిమానే ‘చిత్రం’. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

లోబడ్జెట్ లో తీసిన ‘చిత్రం’ 2000 జూన్ 16న విడుదలై సంచలనాలు నమోదు చేసింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ ను హీరో హీరోయిన్లుగా, ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడిగా ‘చిత్రం’ నుంచే పరిచయమయ్యారు. సహజంగా టీనేజ్ లో ఉండే అమ్మాయిలు, అబ్బాయిల ఆలోచనలను బేస్ చేసుకునే ఈ కథ రాసుకున్నాడు తేజ. అప్పటివరకూ వచ్చిన లవ్ స్టోరీలకు భిన్నంగా సినిమా ఉండటంతో యూత్ ని అట్రాక్ట్ చేసింది. సినిమాలోని పాటలు, సన్నివేశాలు అన్నీ తన టేకింగ్ మాయాజాలంతో ఆకట్టుకునేలా చేశాడు తేజ. దీంతో ధియేటర్లన్నీ కాలేజీలే అయిపోయాయి.

IHG

 

ఒకదశలో వర్మకు ఈ కథ చెప్తే బాలేదని అన్నాడట. కానీ.. తేజ ‘చిత్రం’పై ఆశలు వదులుకోలేదు. తేజ ఆలోచనలను రామోజీరావు నమ్మి ‘చిత్రం’ తీస్తే సెన్సేషనల్ హిట్టయింది. ఆర్పీ పట్నాయక్ సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. నటులను డైరక్టర్లే క్రియేట్ చేస్తారన్న మాటకు తేజ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కెరీర్లో ఎందరో  కొత్త నటులను పరిచయం చేశాడు. ‘చిత్రం’ వచ్చి 20ఏళ్లు అయ్యిందనాలో.. తేజకు దర్శకుడిగా 20 ఏళ్లు అనాలో అర్ధంకాని ‘చిత్ర’మైన పరిస్థితి.

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: