వెండితెరపై ఓ వెలుగు వెలిగి సెలబ్రిటీలు గా చలామణి అయిన వారు క్షణికావేశంలో తమని తాము ఈ లోకం నుండి వేరు చేసుకునే ఘటనలు ఇటీవల ఎక్కువైపోతున్నాయి. సెలబ్రిటీలుగా మన కంటికి వాళ్ళు కనబడుతున్న, బయట ప్రపంచంలో వాళ్ళు మనలాంటి మనుషులే అని, వారికి కూడా ఒత్తిడులు కష్టాలు ఉంటాయి అని,  వాళ్లు ఈ లోకము నుండి వెళ్లిపోయిన తర్వాత బయటపడుతున్న వాస్తవాలు బట్టి తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ బొంబాయిలో తన ఫ్లాట్ లో భయంకరంగా డిప్రెషన్ కి వెళ్లి తనని తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అతి చిన్న వయసులో 34 సంవత్సరాలు ఇంకా కెరియర్ చాలా ఉన్నా భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్లి చూశాక ఆత్మహత్య చేసుకోవటం ఒక బాలీవుడ్ ఇండస్ట్రీని కాదు దేశాన్ని షాక్ కి గురిచేసింది.

 

అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉదయ్ కిరణ్ మరియు రంగనాథ్ సెలబ్రిటీ లుగా బయట మనుషులలో చలామణి అయిన తరువాత అనేక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ మొదటి సినిమా నుండి వరుసపెట్టి హిట్లు కొట్టి అదిరిపోయే స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల అవకాశాలు రాక పోవడం చేసిన సినిమాలు లేకపోవడంతో...డౌన్ ఫాల్ అయినా కెరియర్ ని బ్యాలెన్స్ చేసుకోలేక తీవ్ర ఒత్తిడికి లోనయి ఆత్మహత్య చేసుకోవడం మనం చూశాం.

 

ఏది ఏమైనా సెలబ్రిటీలు జీవితాలలో కూడా ఒత్తిడి ఉంటాయని వాళ్లు మనలాంటి మనుషులే అని ఈ మూడు ఘటనల వల్ల అర్థమవుతుంది. అవకాశాలు వచ్చినా రాకపోయినా ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు ఉండటం సహజం. కానీ వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడా అనేది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. ఈ సందర్భంలో చాలామంది ఒత్తిడి తట్టుకోలేక స్టూడెంట్ లైఫే గాని కుటుంబ జీవితమే గాని ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ ఏ గాని ఏదైనా ఒత్తిడి సహజం...దానిని ఈజీ గా తీసుకుని వాటి నుండి బయట పడే మార్గం చూసుకోవాలి గాని అర్ధాంతరంగా జీవితాలను ముగించుకోవటం అనేది చాలా పెద్ద తప్పు. 

మరింత సమాచారం తెలుసుకోండి: