దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విరుచుకు పడుతుంది. దీనితో ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అవుతూ ఉంది. దింతో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలలో బాగా పడింది. ఇక సినీ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కూడా కనపడటం లేదు అంటూ సినీ ఇండస్ట్రీ వర్గాల వారు తెలియజేస్తున్నారు. అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫైటర్ పై కూడా ప్రభావం తీవ్రంగా పడినట్లు తెలుగు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 

 

 

పూరి జగన్నాథ్ అనుకున్న కాన్సెప్ట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సినిమా చేయలేమన్న పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా దీనితో  పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ లో మార్పులు చేసేందుకు సిద్ధం అవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమాలో పూరి జగన్నాథ్ ముంబై నేపథ్యంలో రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కొన్ని సీన్లలలో విదేశీ ఫైటర్స్ ఫైటింగ్ చేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సీన్ కోసం ఈ సినిమాలో విదేశీ ఫైటర్స్ ఎక్కువమంది నటించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల విదేశాల నుంచి నటీనటులను తీసుకొనివచ్చి ఇక్కడ షూటింగ్ లు చేసే పరిస్థితి కనపడటం లేదు.

 


ఈ కారణంగానే స్క్రిప్ట్ మార్చి లోకల్ ఫైటర్స్ తోనే ఆ ఫైట్స్ చేయాలని పూరి జగన్నాథ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి విజయాలు అందుకున్న పూరి జగన్నాథ్ ఈ సినిమాతో కూడా మంచి విజయం సాధించాలని తాపత్రయపడుతున్నారు. ఇక ఈ సమయంలో ఇలా జరగడంతో అన్ని ప్లాన్స్ కూడా తారుమారయ్యాయి. వాస్తవానికి ఈ సినిమాను ఈ సంవత్సరం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఈ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేయాలని వాయిదా వేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: