టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. అయన సినిమా వస్తుంది అంటే చాలు యూత్ లో ఎక్కువగా మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాను కచ్చితంగా ఆదరించే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఆయన కొరటాల శివ కు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆయన తో సినిమా చేయడానికి గానూ అగ్ర హీరోలు నిర్మాతలు కూడా ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు కొరటాల అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయనకు భారీ ఆఫర్ వచ్చింది. 

 

ప్రభాస్ తో సినిమా చేయడానికి గానూ శోభు యార్లగడ్డ సిద్దమయ్యారు అని సమాచారం. దానికి కొరటాల శివ ను దర్శకుడి గా తీసుకునే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్. కొరటాల శివ తో ఇప్పటికే మాట్లాడారు అని కూడా సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ సినిమాను ప్రభాస్ మరో సినిమాతో పాటు చేయడానికి రెడీ అయ్యాడు అని తెలుస్తుంది. మరి ఈ సినిమాను ఎప్పుడు తీసుకొస్తారు అనేది చూడాలి. దీనికి సంబంధించి రాజమౌళి తండ్రి కథ అందించారు అని సమాచారం. 

 

టాలీవుడ్ లో ఈ సినిమా ఇప్పుడు మరో సంచలనం అవుతుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అగ్ర దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా గురించి తెలుసుకుంటున్నారు. దాదాపు 200 కోట్ల తో ఈ సినిమాను తీసుకుని రావడానికి సిద్దమయ్యారు అని సమాచారం. చూడాలి మరి ఈ సినిమాను తీసుకొస్తారా లేదా అనేది. కాగా ఇప్పుడు ప్రభాస్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: