మన తెలుగులో మాజీ హీరోయిన్ లు కొందరికి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది మాజీ హీరోయిన్ లు అవకాశాల్ కోసం ఎదురు చూస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి గానూ వారు సిద్దంగా ఉన్నారు అనే వార్తలు టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రాని సీనియర్ హీరోయిన్ లు కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అగ్ర హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు అనే తేడా లేకుండా మంచి పాత్రల్లో నటించాలి అని భావిస్తున్నారు. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న పరిస్థితి లో భారీ బడ్జెట్ తో ఏ సినిమా కూడా వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు కాబట్టి సీనియర్ హీరోయిన్ లు ఎక్కువగా డిమాండ్ చేయడం లేదు అని అంటున్నారు. అగ్ర హీరోయిన్ లు చాలా మంది అసలు డిమాండ్ చేయకుండా హీరోకి అక్క లేదా హీరోయిన్ కి అక్క పాత్రలు చేయడానికి సిద్దంగా ఉన్నారు అని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. టాలీవుడ్ లో యువ హీరోయిన్ లు చాలా మందికి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ లు అక్కలు గా నటించడానికి సిద్దంగా ఉన్నారు అని  ప్రచారం జరుగుతుంది. 

 

అనుష్క, కాజల్ ఇప్పుడు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు అని సమాచారం. మరి వాళ్ళు చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న పరిస్థితి లో సీనియర్ హీరోయిన్ లకు భారీగా ఇచ్చే అవకాశం అయితే దాదాప్యుగా లేదు అనే చెప్పాలి. మరి ఎం చేస్తారు ఏ విధంగా సినిమాలు చేస్తారు అనేది చూడాలి. అగ్ర హీరోల సినిమాల్లో ఒకప్పుడు చేసిన వాళ్ళు కూడా ఈ పాత్రల కోసం ట్రై చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: