ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు యువ దర్శకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు అవకాశాలు రాక చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు కొందరు. అందులో కొందరు హీరోలతో మంచి సంబంధాలు లేక ఇబ్బంది పడుతుంటే మరి కొందరు టాలెంట్ ఉన్నా సరే మంచి కథలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందులో దర్శకుడు బాబీ ఒకడు. బాబీ కి మంచి ఆఫర్లు వచ్చాయి గతంలో. కాని ఆయనకు ఇప్పుడు ఏ అవకాశం రావడం లేదు. ఆయన కథ వినిపించినా సరే ఆయన తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు అని తెలుస్తుంది. 

 

అగ్ర హీరోలతో సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు కనీసం చిన్న హీరోలతో సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. జై లవకుశ సినిమా తర్వాత అయన దాదాపుగా కాళీ గానే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన సినిమా చెయ్యాలి అని భావించినా సరే ఆయనను దాదాపుగా పక్కన పెట్టారు అని అంటున్నారు. దీనితో ఇప్పుడు బాబీ తమిళం లో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో దీనికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

 

ఆయన విజయ్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అని సమాచారం మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది చూడాలి. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అని దీని చర్చలు పూర్తి అయితే మాత్రం ఇక అతను చెన్నై కి మకాం మార్చే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్. పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది. అక్కడి నుంచే ఇబ్బందులు మొదలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: