ఈ మద్య మాలీవుడ్ నుంచి వస్తున్న ముద్దుగుమ్మలు తెలుగు, తమిళ సిని పరిశ్రమలో మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  లక్కు కుదిరి బాలీవుడ్ లోకూడా సత్తా చాటుతున్నారు. నయనతార నుంచి ఈ మద్య వచ్చిన కీర్తి సురేష్ వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు.  ఇక తెలుగులో ఇంత వరకు ఒక్క సినిమాలోనూ నటించకపోయినా... సినీ అభిమానులందరికి మాళవిక పరిచయమే. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఎంతో పాప్యులారిటీని సొంతం చేసుకుంది.  'పేట' సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక... ప్రస్తుతం విజయ్ తో కలిసి 'మాస్టర్' చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా… ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది.

 

 తెలుగులో రవితేజ నటిస్తున్న ఓ మూవీ కోసం మాళవికను సంప్రదించారట. అయితే  ఆ  మూవీకి ఈ మళయాల కుట్టి ‘నో’ చెప్పిందట. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా విడుదల అయ్యేంత వరకు కొత్త ప్రాజెక్టుల విషయంలో నిర్ణయం తీసుకోకూడదని ఆమె భావిస్తుండటమే దానికి కారణమట. అయితే విజయ్ దేవరకొండతో కలిసి ‘హీరో’ సినిమా చేయడానికి గతంలో ఆమె అంగీకరించినప్పటికీ… కొన్న కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.  ఒకవేళ హీరో విజయ్ తో నటించిన ‘మాస్టర్’ మూవీ గనక మంచి హిట్ టాక్ వస్తే ఈ బ్యూటీ రేంజ్ పెరిగే అవకాశం ఉంది.

 

ఇక తెలుగు లో రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఆ మద్య రిలీజ్ అయిన డిస్కోరాజా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  మరి ఈ మాలీవుడ్ బ్యూటీ తెలుగులో ఎవరి సరసన, ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ క్రాక్ సినిమాలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: