యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మొట్ట మొదటి సారి వచ్చిన సినిమా 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ సినిమాలో విలన్ పాత్ర లో నవీన్ చంద్ర నటించిన నటన సినిమాకి హైలెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 'అందాల రాక్షసి' సినిమాతో  హీరోగా ఎంట్రీ ఇచ్చినా నవీన్ చంద్ర ప్రేక్షకులను మొదటి సినిమాతోనే బాగానే ఆకట్టుకున్నాడు. అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్న నవీన్ చంద్ర..తన దగ్గరికి వచ్చిన అన్ని రకాల క్యారెక్టర్లను, అవకాశాలను అందిపుచ్చుకొని మెల్ల మెల్లగా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో గతంలో ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' లో విలన్ గా నటించిన నవీన్ చంద్ర, తాజాగా బోయపాటి బాలయ్య బాబు దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమాలో కీలక క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

IHG

ఈ సినిమాలో విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇదే రీతిలో ఓ నెగటివ్ షేడ్ పాత్రలో నవీన్ చంద్ర నీ బోయపాటి చూపించబోతున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే అప్పుడు అబ్బాయి తో ఛాన్స్ కొట్టిన నవీన్ చంద్ర...ఇప్పుడు బాలయ్య బాబుతో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

IHG

ముఖ్యంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు ని ఈ సారి బోయపాటి ఆదుకోవాలని బ్లాక్ బస్టర్ ఇవ్వాలని హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో తన డైరెక్షన్లో వచ్చిన సింహ మరియు లెజెండ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించడంతో ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలని బోయపాటి ప్రతి క్యారెక్టర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: