'సూపర్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క వరుస విజయాలు అందుకొంది. అదిరిపోయే ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తూ సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా దానిలో ఒదిగిపోయి 100% రిజల్ట్ డైరెక్టర్ కి ఇవ్వటంలో అనుష్క ఒక మంచి నటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా తెలుగింటి అమ్మాయి గా అనుష్క చేసిన పాత్రలు ఆమె కెరీర్లోనే కొన్ని సినిమాలు నిలిచిపోయాయి. ఆవిధంగా అరుంధతి, భాగమతి సినిమాలు ఆమె నటన  స్థాయిని అమాంతం పెంచేశాయి అని చెప్పడంలో అతియోశక్తి కాదు .

IHG

అరుంధతి, భాగమతి సినిమాలు ఆమెను టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా ఆ సినిమాలు మార్చేశాయి. అరుంధతిలో అనుష్క నటించిన జేజేమ్మ క్యారెక్టర్ గురించి వేరే చెప్పనవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా జేజేమ్మ గా అనుష్క నిలిచిపోయింది. ఇప్పుడు ఇదే తరహాలో మరోసారి ఓ యంగ్ డైరెక్టర్ అనుష్క నీ చూపించబోతున్నారు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ అనుష్క కి వినిపించినట్లు సమాచారం.

IHG's Padmavati look to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANUSHKA SHETTY' target='_blank' title='anushka-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>anushka</a> Shetty's Devasena

యువి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు...దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం అనుష్క ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నట్లు..దానిలో భాగంగానే ఈ సినిమాని అనుష్క ఓకే చేసినట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: