పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పినా... సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది జెనీలియా. ప్రభాస్ పాటకు ఆమె వేసిన స్టెప్పులకు.. ఇప్పుడు దుమ్ములేచిపోతోంది. 

 

జెనీలియా... ఈమె సినిమాలో చేసిన అల్లరిని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేరు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొని అంతే త్వరగా లైఫ్ లో సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. తన గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంది. 

 

ముఖ్యంగా ఈ లాక్ డౌన్ సమయంలో తన భర్త, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను నెటిజన్స్ తో షేర్ చేసుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి మూవీలోని మనోహరి పాటకు, తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఇసుకలో జెనీలియా వేస్తోన్న స్టెప్పులకు నిజంగానే దుమ్ములేచిపోతోంది. 

 

హ్యాపీగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేయండి.. అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో క్యాప్షన్ పెట్టి.. ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో నెటిజన్ లు జెనీలియా డ్యాన్స్ కు ఫిదా అయిపోతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఎప్పుడు.. ప్రభాస్ పక్కన మిమ్మల్ని చూడాలని ఉందంటూ.. కామెంట్ చేస్తున్నారు.

 

మరి ప్రేక్షకుల కోరిక మేరకు జెనీలియా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. జెనీలియా.. ఒకప్పుడు వెండితెరపై చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆమె చేష్టలను గుర్తు చేసుకుంటున్నారు సినీజనాలు. మళ్లీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: