కరోనా వల్ల పరిస్థితులు బాగా లేకపోవడంతో స్టార్ హీరో, హీరోయిన్లను రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు అయితే ఇప్పటివరకు ఏ ఒక్క స్టార్ కూడా ముందుకు వచ్చి పారితోషికం తగ్గించుకోలేదు కానీ కోలీవుడ్ లో యంగ్ హీరోలు విజయ్ ఆంటోనీ , హరీష్ కళ్యాణ్ అలాగే స్టార్ డైరెక్టర్ హరి తమ రెమ్యూనరేషన్ ను 25శాతం తగ్గించుకుంటున్నామని ఇటీవల ప్రకటించారు.
 
ఇక ఇప్పుడు ఈజాబితాలోకి రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా చేరింది. తనను కూడా 20 -30 శాతం వరకు రెమ్యూనరేషన్ తగ్గించుకోమని నిర్మాతలు అడిగారని ప్రస్తుతం వున్న పరిస్థితిని నేను అర్ధం చేసుకోగలను అందువల్ల పారితోషికం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కీర్తి చెప్పింది. మిగితా వారు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకొని నిర్మాతలకు మేలు చేయాలని ఆమె కోరింది. ఇక రెమ్యూనరేషన్ తగ్గించుకున్న మొదటి హీరోయిన్ కీర్తినే. 
 
ఇదిలావుంటే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పెంగ్విన్ థియేటర్ రిలీజ్ లేకుండా జూన్ 19న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. తమిళ ,తెలుగు తోపాటు మలయాళం లో విడుదలకానుండగా కొద్దీ రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది దాంతో పెంగ్విన్ పై అంచనాలు పెరిగిపోయాయి. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించాడు. ఇక ప్రస్తుతం కీర్తి చేతిలో మూడు సినిమాలు వున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నాథే. ఈ చిత్రంలో కీర్తి ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఇక మిగతావి రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. అందులో ఒకటి మిస్ ఇండియా కాగా మరొకటి గుడ్ లక్ సఖి. 

మరింత సమాచారం తెలుసుకోండి: