టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరి చూపు దర్శక ధీరుడు రాజమౌళి వైపే ఉంది. అది ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం అనుకుంటే పొరపాటే. ఇటీవల చిత్ర పరిశ్రమ సినిమాలని పునఃప్రారంభించేందుకు ముఖ్య మంత్రి నుంచి అనుమతులు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనుమతులైతే తెచ్చుకున్నారుగాని ఏ ఒక్కరు సెట్స్ లోకి వచ్చేందుకు సాహసించడం లేదని తెలుస్తుంది.

 

ఏరకంగా షూటింగ్ మొదలు పెట్టాలి ఎంతమంది ని తీసుకోవాలి...ఎలాంటి సీన్స్ ముందు షూట్ చేయాలి ...ఇలా మిలియన్ డాలర్ ప్రశ్నలెన్నో దర్శక నిర్మాతల మెదడులో తిరుగుతున్నాయి. అయితే భారీ బడ్జెట్ తో ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళి ముందుగా రెండు రోజులు ట్రయల్ షూట్ నిర్వహించాలని అనుకున్నారు. దాన్ని బట్టి తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెడదామా లేదా అన్నది ఆలోచించాలనుకున్నారట. 

 

ఇదే ఇప్పుడు ఆయనకి భారంగా మారిందని అంటున్నారు ఇండస్ట్రీలో. ఎటూ రెండు రోజులు రాజమౌళి మాక్ షూట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అందరూ వెనక ఉండి ఆయన్ని ముందుకు తోస్తున్నారట. రాజమౌళి రెండు రోజులు నిర్వహించే మాక్ షూట్ గనక సక్సస్ అయితే ఒక్కొక్కరుగా తమ సినిమా షెడ్యూల్స్ ని ప్లాన్ చేద్దామనుకుంటున్నారట. ఇది కొంతమందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు రాజమౌళినే మిగతవాళ్ళు ఎవరూ ముందుకు రారా...వాళ్ళలో ధైర్యం లేదా ...ఇదేం స్ట్రాటజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారట.

 

వాస్తవంగా ఆలోచిస్తే ఆచార్య ముందు ఇలాగే రెండు రోజులు మాక్ షూట్ చేయొచ్చు. లేదా పుష్ప కుడా చేయొచ్చు. ఇంకా కొన్ని సినిమాలు ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ జరుపుకొని ఉన్నాయి. కాని వాళ్ళందరికి ధైర్యం సరిపోవడం లేదా లేక యూనిట్ సభ్యుల గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతున్నారా అన్నది అర్థం కావడం లేదు. ఒకవేళ రెండది కారణం అయితే మాత్రం మేకర్స్ మంచే ఆలోచించారు. అది కాకుండా అయితే మాత్రం ఈ విషయంలో కూడా రాజమౌళి దర్శక "ధీరుడే" అని చెపాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: