దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పారు. ఒక్క బాహుబలి సినిమాతో రాజమౌళి మన తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ కంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. చెప్పాలంటే హాలీవుడ్ లో రూపొందిన 300, వార్, స్టార్ వార్స్, అవేంజర్స్ వంటి సినిమాల తో బాహుబలి సినిమా రేంజ్ ని పోల్చుకునేలా చేశారు.

 

అప్పటి వరకు హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుకున్న యావత్ ప్రపంచం బాహుబలి ఫ్రాంఛైజీ తో హాలీవుడ్ దర్శకులు కూడా మన తెలుగు సినిమా వైపు చూసేలా రాజమౌళి వండర్ ని క్రియోట్ చేశారు. అంతేకాదు టాలీవుడ్ హీరో అన్న ఇమేజ్ నుండి పాన్ ఇండియా స్టార్ అన్న ఇమేజ్ ని ప్రభాస్ కి ఇచ్చారు. 

 

ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఎన్టీఆర్, రాంచరణ్ ల తో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవంగా ఈ జూన్ లేదా జూలై లో ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు చిత్ర యూనిట్. కాని గ్రాఫిక్స్ వర్క్, సీ.జి వర్క్ కంప్లీటవకపోవడంతో వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేస్తామని అఫీషియల్ గా రాజమౌళి అనౌన్స్ చేశారు.

 

అయితే ఇప్పుడు కరోనా వచ్చి రాజమౌళి తో పాటు ఈ సినిమాని నిర్మిస్తున్న డివివి దానయ్యని ఆందోళన చెందేలా చేసింది. రాజమౌళి చెప్పినట్టుగా వచ్చే ఏడాది జనవరి 8 న కూడా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో బిజినెస్ పరంగా టాక్ నడుస్తోంది. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఎంత వసూళ్ళని రాబడుతుందో అసలు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా ..అందుకు పరిస్థితులు అనుకూలిస్తాయా అంటూ నిర్మాత టెన్షన్ పడుతున్నారట.

 

అయితే రాజమౌళి నిర్మాతకి ఎటువంటి అధైర్యం చెందాల్సిన అవసరం లేదని భారీ స్థాయి లాభాలు రాకున్నా కనీసం లాభాలు వస్తాయని నమ్మకాన్ని కలిగిస్తున్నారట. అంతేకాదు హీరోలతో పాటు ఇతర టెక్నీషియన్స్ కి నిర్మాతని దృష్ఠిలో పెట్టుకొని ఇప్పటి నుంచి డబుల్ ఎనర్జీతో పనిచేయాలని చెబుతున్నారట. అందుకు అందరూ సహకరిస్తామని మాటిచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పటి నుంచే దర్శక నిర్మాతల్లో రికార్డ్ స్థాయి వసూళ్ళు రావన్న భావన వచ్చిందని చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: