ఒక్క పెద్ద స్టార్ కొడుకు అయినా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఒక స్టార్ హీరో కొడుకు మరో స్టార్ హీరో అయిపోవడం అంత ఈజీ కాదు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడనే పేరు తెచ్చుకున్నావారేంతమంది. చిరంజీవి అనే ఒక మెగా స్టార్ కొడుకు మగధీరుడు అనిపించుకున్నాడు. రామ్ చరణ్, చిరుతగా ఎంట్రీ ఇచ్చినా.. అది జస్ట్ ఓ వెల్కమ్ డ్రింక్ గానే అనిపించింది అభిమానులకు. రెండో సినిమా మగధీరతోనే అభిమానుల ఆకలి తీర్చేశాడు రామ్ చరణ్.

 

IHG

 

ఈ సినిమాలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కలిసి నటించారు. అనంతరం వీరిద్దరి కంబినేషనలో గోవిందుడు అందరివాడేలే సినిమాలో మరోసారి జత కట్టి ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు. రాజమౌళి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘మగధీర’ అంటే అతిశయోక్తికాదు. ఎస్.ఎస్.రాజమౌళి తన దర్శక ప్రతిభ ఏపాటిదో ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఇలాంటి గొప్ప చిత్రం వచ్చి పదేళ్లు గడిచిపోయింది.

 

IHG

 

ఒకొక్కడ్ని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకేసారి రమ్మను” ఈ డైలాగ్ కొన్నాళ్లు పాటు జనాల రింగు టోన్. అంతలా పేలింది. అయితే కేవలం డైలాగ్ లో రైమింగ్ ఉన్నంతమాత్రానా పేలిందని అనుకుంటే పొరపాటే. థియేటర్ లో కేవలం డైలాగ్ కొట్టి ఆగిపోలేదు. నిజంగానే వందమందిని ఊచకోత కోశాడు భైరవ.

 

IHG

 

కాళ భైరవుడిగా రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ చిత్రంతో తన స్టామినాను రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమా మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ ఫైట్స్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఇలా ఈ సినిమాలో ప్రతి అంశం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమాతో కాజల్,రామ్ చరణ్ కి స్టార్ డాం తీసుకొచ్చాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: