కరోనా సమస్య వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో రాజమౌళి ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్ని భారీ సినిమాలు కావడంతో షూటింగ్ స్పాట్ లో కనీసం 100  మంది యూనిట్ సభ్యులు లేకుండా రాజమౌళి ఇప్పటి వరకు షూట్ చేసిన సందర్భాలు లేవు.


అయితే కరోనా వల్ల అన్ని పరిస్థితులు మారిపోవడంతో ఇప్పుడు రాజమౌళి ప్రభుత్వ నియమాలను అనుసరించి కేవలం 40 మందితో షూట్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంత తక్కువ మందితో ఎలా షూట్ చేయాలి అన్న యాక్షన్ ప్లాన్ ను రాజమౌళి తన మనసులో ఏర్పరుచుకుని ఈమధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ను నిర్మాత దానయ్య ఆఫీసుకు పిలిపించి చాల వివరంగా మాట్లాడినట్లు టాక్.


కరోనా క్రైసిస్ వలన ఈమూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉండబోతోంది అన్న అంచనాలు ఇవ్వడమే కాకుండా ముందుగా ఈసినిమాకు సంబంధించి గతంలో ఊహించుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ రాకపోవచ్చు అన్న సంకేతాలు ఇచ్చినట్లు టాక్. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ అంతా పూర్తి ఎఫర్ట్స్ పెట్టి రెట్టింపు ఉత్సహంతో పనిచేయకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి చేయడం కష్టం అనీ దీనికోసం యూనిట్ సభ్యులు అంతా వారివారి భయాలను పక్కకు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.


ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ నటిస్తూ ఉండటంతో డేట్స్ విషయంలో అనేక సమస్యలు వస్తాయని ఆ సమస్యలను దాటుకుంటూ షూటింగ్ ను పూర్తిచేయాలి అంటే చాల పట్టుదల అవసరమని రాజమౌళి యూనిట్ కు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి చరణ్ జూనియర్ లు హాజరయ్యారని లీకులు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి చరణ్ జూనియర్ లు లాభాలలో వాటాలు తీసుకుంటున్న పరిస్థితులలో ఈమూవీకి అంతక్రితం ఊహించిన విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగకపోతే రాజమౌళి చరణ్ జూనియర్ ల కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. ఈ పరిస్థితులు వల్ల రాజమౌళి ఇలా సున్నితమైన క్లాస్ తన యూనిట్ సభ్యులకు ఇచ్చి ఉంటాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: