టాప్ హీరో ప్రభాస్ కు నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసి వచ్చినట్లుగా కనిపించడంలేదు. ‘బాహుబలి’ లాంటి భారీ విజయాన్ని అందుకోవాలని గత సంవత్సరం ప్రభాస్ చేసిన ‘సాహో’ ఫలితం వికటించడంతో ప్రభాస్ ఇక తన ఆశలు అన్నీ దిల్ రాథా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పై పెట్టుకున్నాడు.


ఈసినిమా ఒక ప్యూర్ లవ్ స్టోరీ 1980 ప్రాంతంలో యూరప్ లో ఈసినిమా ప్రేమకథ నేపధ్యం ఉంటుంది. దీనితో సహజంగా ఉండాలని ప్రభాస్ ఈసినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ యూరప్ లో పూర్తి చేసాడు. ఈలోపున కరోనా సమస్యలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో తన యూరప్ షెడ్యూల్ ను మధ్యలో ఆపుకుని ప్రభాస్ హైదరాబాద్ తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే.


ఇక తాను యూరప్ వెళ్ళడం సాధ్యం కాదు అని గ్రహించిన ప్రభాస్ ఈమూవీ షూటింగ్ కోసం 1980 కాలంనాటి యూరప్ పరిస్థితులను బిల్డింగ్ లను పోలిన సెట్స్ వేయించాడు. ఇప్పుడు షూటింగ్ లకు తిరిగి అనుమతులు లభించడంతో తన మూవీ షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో నిర్మించిన యూరప్ ను పోలిన సెట్ లో తన మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలకు ఒక అనుకోని అడ్డంకి తగిలినట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రభాస్ ఈ సినిమా కోసం నిర్మింపచేసిన యూరప్ బిల్డింగ్ ల సెట్ చూడటానికి చాల బాగున్నా ఇప్పటికే యూరప్ లో ఈసినిమాకోసం తీసిన సీన్స్ లోని బిల్డింగ్స్ కు ఇప్పుడు భాగ్యనగరంలో రూపొందిన సెట్ కు కొద్దిపాటి తేడాలు ప్రభాస్ దృష్టికి వచ్చినట్లు టాక్. వాస్తవానికి ఈ తేడాలను గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయవచ్చు అని యూనిట్ చెపుతున్నా సినిమాకు సంబంధించిన సహజత్వం దెబ్బ తింటుందేమో అన్న భయాలు ప్రభాస్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూజా హెగ్డే తాను నటిస్తున్న ప్రభాస్ అఖిల్ సినిమాలలో ఏది ముందు మొదలైతే దానికి తన డేట్స్ ముందుగా ఇస్తాను అని చెపుతున్నట్లుగా వార్తలు వస్తున్న పరిస్థితులలో హైదరాబాద్ లో రియల్ యూరప్ ను ఎలా తీసుకురావాలో తెలియక ప్రభాస్ తల పట్టుకుంటున్నట్లు టాక్..    

మరింత సమాచారం తెలుసుకోండి: