మన తెలుగులో హీరో హీరోయిన్ లు కలిసి చేసినవి ఒక సినిమానే అయినా సరే వాళ్ళకు వచ్చే గుర్తింపు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వారిని జనాలు కచ్చితంగా ఆదరించే పరిస్థితి అనేది ఉంటుంది. సినిమా ఏ విధంగా ఉన్నా సరే వాళ్ళను మాత్రం జనాలు కచ్చితంగా ఆదరిస్తారు అనే విషయ౦ అందరికి తెలిసిందే. మన తెలుగులో  మహేష్ బాబు అమృత రావు కాంబినేషన్ కి మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. వీరు ఇద్దరూ కలిసి అతిధి సినిమాలో నటించారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అనే సంగతి తెలిసిందే. 

 

అయినా సరే వీరి కాంబినేషన్ కి మాత్రం చాలా మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో నటించిన హీరోయిన్ అమృత క్యూట్ గా ఉందని మహేష్ పక్కన సరిగా సరిపోయింది అని చాలా మంది చాలా సందర్భాల్లో కామెంట్స్ కూడా చేసారు కూడా. ఆ విధంగా ఆ పెయిర్ జనాలకు బాగా నచ్చింది అని చెప్పాలి. ఇక ఇద్దరూ కూడా ఎమోషన్ ని ప్రేమలో బాగా పండించారు అని చెప్పాలి. ఈ సినిమా మహేష్ కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ అని అంటారు జనాలు. మహేష్ బాబు ఆ సినిమాను ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. సినిమా కథ జనాలకు అంత బాగా ఎక్కలేదు అని అంటారు. 

 

అందుకే సినిమా ఫ్లాప్ అయింది అనేది చాలా మంది చెప్పే మాట. ఇక ఇప్పుడు మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో  బాలీవుడ్ హీరోయిన్ తో సినిమా చేస్తున్నాడు. ఇక అమృత రావు ఆ సినిమా తర్వాత పెద్దగా టాలీవుడ్ లో కనపడలేదు అనే చెప్పాలి. ఆమె స్కిన్ షో చేయను అని చెప్పడం తో ఆమెను టాలీవుడ్ పక్కన పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: