టాలీవుడ్ లో ఒక్క సినిమా తో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న కాంబినేషన్ మహేష్ బాబు త్రిష. వీరు ఇద్దరూ కలిసి అతడు సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వీరి కాంబినేషన్ కి మాత్రం చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. ఆ సినిమాలో వీరి ప్రేమ జనాలకు బాగానే నచ్చింది అనేది వాస్తవం. సినిమాలో ప్రతీ సీన్ లో కూడా ఇద్దరూ నటన తో యూత్ కి బాగా దగ్గరయ్యారు అనే చెప్పాలి. యూత్ లో అప్పుడు త్రిష కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ ని ఆమె బాగా క్యాష్ చేసుకుంది. ఇక ఆ సినిమాలో ఆమె పల్లెటూరి అమ్మాయిలా కనపడింది. 

 

సినిమా తర్వాత ఆమెకు తెలుగులో చాలా మంచి ఆఫర్లు వచ్చాయి అదే సమయంలో ఆమెను వివాదాలు కూడా బాగానే ఇబ్బంది పెట్టాయి అని చెప్తారు టాలీవుడ్ జనాలు. ఇక ఆ సినిమాలో మహేష్ పక్కన ఆమె కరెక్ట్ గా సెట్ అయింది. ఇక ఇద్దరి లవ్ స్టోరీ కూడా జనాలకు చాలా బాగా నచ్చి౦ది అనేది వాస్తవం. ఇద్దరూ కూడా పల్లెటూరి వాతావరణం లో లవ్ చేసుకున్నారు. వాళ్ళు హగ్ చేసుకున్నా వాళ్ళు ముద్దు పెట్టుకున్నా పెద్ద అభ్యంతరంగా ఏమీ జనాలకు కనపడలేదు అని చెప్పాలి. 

 

సినిమా మాత్రం ఫ్లాప్ అయింది అనే సంగతి తెలిసిందే. అయితే సినిమా కథ జనాలకు నచ్చలేదు అని అంటారు కొందరు సినిమా కథ జనాలకు ఎక్కలేదు అని అంటారు మరి కొందరు. ఏది ఎలా ఉన్నా సరే సినిమా మాత్రం టీవీ లో సూపర్ హిట్ అయింది అనే సంగతి తెలిసిందే. సినిమాలో ఉండే సీన్స్ జనాలకు తర్వాత బాగా నచ్చాయి అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: