టాలీవుడ్ లో హిట్ పెయిర్స్ అనగానే చాలా మంది చెప్పే మాట తరుణ్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్. ఇద్దరూ కూడా చేసింది రెండు మూడు సినిమాలే అయినా సరే వీరు ఇద్దరికీ మాత్రం చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. వీరి కాంబినేషన్ కి  జనాలు మంచి ఆదరణ అందించారు అనేది వాస్తవం. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వీరిని చాలా బాగా ఆదరించారు. ఇక సినిమాలో వీరి నటన  వీరి ప్రేమ అన్నీ కూడా అప్పట్లో యూత్ కి బాగా నచ్చాయి అని చెప్పాలి. సోనిమాలో నటిస్తే అలా చెయ్యాలి అనే విధంగా ఇద్దరూ కూడా అప్పట్లో నటించారు. 

 

ఇక వీరిని చూసి చాలా మంది యువత ప్రేమ మీద కూడా ఫోకస్ చేసారు అని అంటారు జనాలు. ఆ విధంగా యూత్ లో వీరి ప్రేమ  కథ బాగా వెళ్ళింది. రియల్ లైఫే  లో కూడా ఇద్దరూ చాలా బాగా దగ్గరయ్యారు. అయితే తరుణ్ కారణం గానే ఆమె కెరీర్ ఇబ్బంది పడింది అని జనాలు చెప్తారు. నిజం ఎంత ఉన్నా సరే వారి కాంబినేషన్ విషయంలో జనాలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది అని చాలా మంది చెప్తూ ఉంటారు. కాని ఆ విషయాన్ని రెండు కుటుంబాలు అప్పట్లో బయటకు చెప్పలేదు అనే చెప్పాలి. 

 

ఇక టాలీవుడ్ లో వీరిని  మించిన కాంబినేషన్ అప్పట్లో లేదు అని అంటారు జనాలు. ఆ విధంగా స్క్రీన్ మీద తాము ఏంటో చూపించారు. ఇక ఆర్తి అగర్వాల్ అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా తరుణ్ సినిమాలకు దాదాపుగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతనికి అవకాశాలు ఎవరూ కూడా ఇచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: