టాలీవుడ్ లో యినా తమిళంలో అయినా సరే సూపర్ హిట్ అయిన సినిమాల్లో... నరసింహ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమా ఎన్నో రికార్డ్ లను తన ఖాతాలో వేసుకుంది అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా అప్పట్లో ఒక ఊపు ఊపింది అని చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా రజని నటన అదే విధంగా విలన్ గా నటించిన రమ్యకృష్ణ నటన హీరోయిన్ గా చేసిన సౌందర్య నటన అన్నీ కూడా జనాలకు చాలా బాగా నచ్చాయి అని చెప్పాలి. 

 

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్ హీరో ప్రేమ కథ చాలా అందంగా ఉంటుంది. సినిమాను ఎంత అందంగా దర్శకుడు చూపించాడో ఇద్దరి మధ్య ప్రేమ కథ ను కూడా దే విధంగా అందంగా చూపించాడు అనే చెప్పాలి. సినిమాలో ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. వీరి లవ్ స్టోరీ కి అక్కడి నుంచి మంచి డిమాండ్ వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత రజనీ కాంత్ ఆల్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమా అన్ని భాషల్లో కూడా చాలా బాగా హిట్ అయింది అని చెప్పాలి. ఈ సినిమా వసూళ్లు కూడా చాలా బాగా వచ్చాయి అప్పట్లో. 

 

ముఖ్యంగా తమిళం తెలుగు లో అయితే ఈ సినిమా ఒక రేంజ్ లో జనాలకు నచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత రజని ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన మినహా ఎవరు చేసినా సరే సినిమాకు అందం రాదు అంటూ కామెంట్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: