ఈ సంవత్సరం అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్లతో హ్యప్పీగా స్టార్ట్ అయ్యిందని సంబరపడుతుంటే నెల తిరక్కుండానే ఆ ఆనందానికి కరోనా రూపంలో అడ్డుకట్ట పడింది. కరోనా లేకపోతే ఈ వేసవిలో బాక్సాఫీసు బద్దలు అయ్యుండేది. ఎన్నో సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండి ఆగిపోయాయి. ఫలితంగా సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులని ఎదుర్కుంటోంది. అటు థియేటర్లు మూతబడి ఆదాయం ఆగిపోయింది.

 


 
కరోనా కారణంగా అంతకుముందు చేసుకున్న ప్లాన్లన్నీ తారుమారు అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వరల్డ్ ఫేమస లవర్ డిజాస్టర్ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై విజయ్ అభిమానులు బాగా ఆశలు పెట్టుకున్నాడు. అదీగాక ఈ సినిమా ద్వారా విజయ్ బాలీవుడు లో పరిచయం అవుతున్నాడు.

 

 

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా పూర్తిగా ముంబయిలో షూటింగ్ జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో హైదారాబద్ లోనే షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట. ఇకపోతే లాక్డౌన్ టైమ్ లో ఈ సినిమా కథలో చాలా మార్పులు జరిగాయట. కథా ప్రకారం విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విదేశీ ఫైటర్లతో తలపడాల్సి ఉందట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుండి నటీనటులని తీసుకురావడం సాధ్యమయ్యే పనికాదని లోకల్ ఫైటర్స్ చేత ఆ సీన్స్ ని పూర్తి చేసే విధంగా కథలో మార్పులు చేసాడట. 

 

 

దాంతో సినిమాలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏదేమైతేనేం ఈ మార్పుల వల్ల లోకల్ టాలెంట్ బయటకి వస్తుంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం మణిశర్మ సమకూరుస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: