అవును పగే. సినిమాల్లో అయితే మొక్కే కానీ అని తీసిపారేస్తే పీక తెగిపోతుంది అంటూ మండిపోయే డైలాగులు పండించే మెగాస్టార్ చిరంజీవి రియల్ లైఫ్ లో స్మూత్ గా ఉన్నా కూడా అదే పౌరుషం, అదే పవన్ అలాగే ఉంది, ఉంటుంది కూడా. ఎంతైనా మాస్, ఊరమాస్ సినిమాలు లెక్కలేనన్ని చేసిన హీరో కదా.

 

ఇక బాలయ్య చూస్తే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ గా ఈ మధ్య టార్గెట్ చేశారు. ఆయన సినీ పెద్దగా ఉండడం ఇష్టం లేనట్లుగానే మాటల ద్వారా బయటపెట్టుకున్నాడు. ఇక అదే సమయంలో దాసరి నారాయణరావు కంటే ఎవరూ సినిమా వారికి సేవ చేయలేదని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని కూడా బాలయ్య భారీ డైలాగు కొట్టారు. ఇవన్నీ చూసినపుడు కచ్చితంగా మెగాస్టార్ కి కోపం రావాల్సిందే.

IHG

అయితే మెగాస్టార్ చిరంజీవి చాలా కూల్ గా బాలయ్యకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పేసి ఊరుకున్నాడు. సరే ఊరుకున్నాడు కదా అని ఈ కధ ఇక్కడితో ఆగిపోదు అంటున్నారు. చిరంజీవి ఇపుడు ఆచార్య మూవీ చేస్తున్నాడు, ఈ మూవీ కొరటాల డైరక్షన్లో వస్తోంది. ఈ మూవీలో భారీ డైలాగులకు లోటు లేదు. దాంతో బాలయ్య మీద పవన్ ఫుల్ డైలాగులు వేయడానికి ఈ మూవీని చిరు ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు.

IHG

ఈ మూవీలో చిరంజీవి బాలయ్యను టార్గెట్ చేసే డైలాగులు ఉంటాయని అపుడే రూమర్స్ వస్తున్నాయి. చిరంజీవి మరి ఏ రేంజి డైలాగులు రాయిస్తారో. వాటిని ఎలా తన నోటి వెంట పేలుస్తారో, అవి ఎలా డైనమేట్లుగా మారి టార్గెట్ చేసిన వారికి గుచ్చుకుంటాయో అంతా చూడాల్సిందే.

IHG

మొత్తం మీద చూసుకుంటే చిరు కోపమని ఊరుకుంటే కుదిరేది కాదు అంటున్నారు. చిరుది ధర్మాగ్రహమని అది ఆగ్రహిస్తే ఆ పవరేంటి, రేంజి ఏంటి అన్నది అంతా చూస్తారని కూడా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: