నాగబాబు సొంతంగా నిర్మించిన ఆరంజ్ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది కానీ ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. 2010 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహించగా రామ్ చరణ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రియురాలు చేత తీవ్రంగా మోసపోయిన రామ్(రామ్ చరణ్) జాను( జెనీలియా) ని ప్రేమిస్తాడు కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపాడు. కానీ కాలక్రమేణా తనకు జాను పై ఎంత ప్రేమ ఉందని అర్థం చేసుకొని ఆమెతో జీవితాంతం కలిసి ఉండాలని రామ్ నిశ్చయించుకుంటాడు. 


కానీ అప్పట్లో కొంతకాలమే ప్రేమిస్తా అనే రామ్ ప్రేమకథ ప్రేక్షకులకు వెగటు గా అనిపించింది. దాంతో ఆరంజ్ మూవీ కొద్దిపాటి ప్రేక్షకాదరణ కూడా పొందలేదు. కానీ టీవీలో ప్రతినెల ప్రసారమయ్యే ఆరంజ్ సినిమా చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ జెనీలియా మధ్య కొనసాగే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు. రూబా పాత్రలో షాజాన్ పదమ్సీ నటించి ప్రేక్షకులను బాగా అనిపించింది. పాటలు, డాన్సులు, బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు గట్రా ప్రేక్షకులను బాగా అలరించాయి కానీ అసలైన కథ విడ్డూరంగా ఉండడంతో నాగబాబు అప్పుల పాలయ్యాడు.

 

బుజ్జి బుజ్జి మాటలతో అమాయకంగా కనిపిస్తూనే రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన జెనీలియా కు ఈ సినిమా ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. నేను నువ్వంటూ పాటలో జెనీలియా సూపర్ క్యూట్ గా కనిపించింది. ఈ పాటని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు వింటూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ హ్యారిస్ జైరాజ్ కే దక్కుతుందని చెప్పవచ్చు. ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అయినా, పాటలు మాత్రం సూపర్ హిట్ గా నిలిచి జెనీలియా రామ్ చరణ్ కాంబినేషన్ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: