కరోనా సమస్య ఫిలిం ఇండస్ట్రీని పూర్తిగా సమస్యలలో ముంచివేయడమే కాకుండా సినిమా దర్శక నిర్మాతల ఆలోచనలను కూడ పూర్తిగా మార్చేసింది. ఎంత భారీ సినిమా అయినప్పటికీ పరిస్థితుల రీత్యా పూర్తిగా రాజీ పడుతూ ఇండోర్ సూట్ చేయవలసిన స్థితి తప్ప మరొకమార్గం లేకుండా పోయింది.


ఇలాంటి పరిస్థితులలో సినిమా కథ రీత్యా పూర్తిగా దట్టమైన అరణ్య ప్రాంతాలలో తీయవలసి ఉన్న ‘పుష్ప’ కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను సుకుమార్ పూర్తిగా మార్చివేసాడని వార్తలు వస్తున్నాయి. కరోనా భూతం ఇప్పట్లో తొలిగిపోదు అన్న క్లారిటీ రావడంతో సుకుమార్ తన అరణ్య ప్రాంతాల అవుట్ డోర్ షూటింగ్ ఆలోచనలు పక్కకు పెట్టి ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


తెలుస్తున్న సమాచారంమేరకు సుకుమార్ రామోజీ ఫిలిం సిటీలోని ఐదు ఎకరాల ఖాళీ స్థలంలో ఒక కృత్రిమ ఫారెస్ట్ ను క్రియేట్ చేసే ఆలోచనలు చేయడమే కాకుండా దీనికి సంబంధించి అరణ్యాల నిర్వాహణ విషయంలో చాల అనుభవం ఉన్న కొన్ని అంతర్జాతీయ ఏజెన్సీస్ సహాయం తీసుకుని ఒక కృత్రిమ ఫారెస్ట్ ను క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈసినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఈ కృత్రిమ ఫారెస్ట్ లో తీసిన సన్నివేశాలను గ్రాఫిక్ ఎక్స్ పర్ట్స్ సహాయంతో ఆ సన్నివేశాలు అన్నీ నిజంగానే ఒక దట్టమైన అరణ్య ప్రాంతంలో తీసారు అని అనిపించే విధంగా సుకుమార్ మేనేజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


పూర్వకాలంలో పాత సినిమాలు తీసే రోజులలో ఎన్టీఆర్ ఎఎన్ఆర్  కాంతారావులు జానపద సినిమాలలో నటించే రోజులలో గుర్రపు ఛేజింగ్ సన్నివేశాలు తీసేడప్పుడు అప్పటి సీనియర్ హీరోలు సెట్లో చెక్క గుర్రం ఎక్కి గుర్రం స్వారీ చేస్తున్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే నిజంగానే తమ హీరోలు గుర్రపు స్వారీ చేస్తున్నట్లు అప్పటి ప్రేక్షకులు భావించేవారు. ఇప్పుడు కరోనా తో తిరిగి మన హీరోలను ఇలా ఆర్టిఫిషియల్ అరణ్యాల వైపు ఆర్టిఫిషియల్ పూల తోట్లవైపు అడుగులు వేసేలా చేస్తోంది అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: