టాలీవుడ్ లో పుష్ప సినిమాకు సంబంధించి లుక్ విడుదల అయిన వెంటనే జనాలు సినిమాపై ఒక అంచనాకు వచ్చేశారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది సినిమా కథ ఏ విధంగా ఉంటుంది సినిమాను ఏ విధంగా తీసుకొస్తారు అంటూ జనాలు దీని గురించి ఎదోకరకంగా చర్చలు చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బన్నీ పాత్ర సినిమాకే హైలెట్ అని అంటున్నారు. ఇప్పటి వరకు అతను అలాంటి పాత్రలు ఎప్పుడు కూడా చేయలేదు అని ఇప్పుడు అలాంటి పాత్ర చేస్తున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని వాయిదా వేసుకోవాలి అని చిత్ర యూనిట్ కి అల్లు అర్జున్ కి ఆయన భార్య స్నేహా రెడ్డి చెప్పినట్టు సమాచారం. సినిమా షూటింగ్ ఇప్పుడు అవసరం లేదు అని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లో చెయ్యాలి అని ఇప్పుడు అక్కడ కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంత రిస్క్ అవసరం లేదు అని స్నేహా రెడ్డి బన్నీ కి చెప్పింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాను కరోనా కాస్త తగ్గిన తర్వాత మొదలు పెట్టుకోవాలి అని ఆమె సూచనలు కూడా ఇచ్చిందట. 

 

దీనితో చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమాను వాయిదా అవేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. ఇక బన్నీ కూడా సినిమా షూటింగ్ కి ఆలస్యంగా వస్తా అని చెప్పాడు అని సమాచారం. అందుకే ఇప్పుడు ఈ సినిమా లేట్ అయ్యే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత మరి బన్నీసినిమా చేస్తాడు అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: